Hyderabad: ‘యోగా ఉత్సవ్‌ని ప్రారంభించిన గవర్నర్ తమిళసై.. 25 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు

మరో 25 రోజుల్లో యోగ డే సందర్భంగా.. కౌంట్ డౌన్ యోగ దినోత్సవ వేడుకలను ఈ రోజు నుంచి హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కౌంట్ డౌన్ యోగ దినోత్సవ వేడుకలను ఈ రోజు నుంచి నిర్వహించడం జరుగుతుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.

Hyderabad: యోగా ఉత్సవ్‌ని ప్రారంభించిన గవర్నర్ తమిళసై.. 25 రోజుల పాటు కొనసాగనున్న ఉత్సవాలు
Yoga Utsa In Hyderabad

Updated on: May 27, 2022 | 1:10 PM

Hyderabad: జూన్ 21 న యోగ డే నేపథ్యంలో యోగ ఉత్సవ్ 25 రోజుల ఉత్సవ కార్యక్రమం హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో నేడు ప్రారంభమయింది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించ బడుతున్న ఈ యోగ ఉత్సవ్ 25 రోజుల ప్రారంభ కార్యక్రమానికి గవర్నర్ తమిళసై సౌందర రాజన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.  జ్యోతి ప్రజ్వలన చేసి ఈ  ఉత్సవ కార్యక్రమాన్ని తమిళసై ప్రారంభించారు.

Yoga Utsa In Hyderabad 1

ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సర్భానంద, సినీ నటులు మంచు విష్ణు, లావణ్య త్రిపాఠి, తేజ సజ్జా, ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి మితాలి రాజ్, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ నైనా జైశ్వల్, బీజేపీ నేతలు డాక్టర్ లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజా సింగ్ తో పాటు ఇతర ప్రముఖులు అతిధులుగా హాజరయ్యారు. ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. మినిస్ట్రీ ఆఫ్ యోగా నేత్రుత్వంలో నిర్వహించ బడుతున్నటువంటి ఈ యోగ ఉత్సవాలు 25 రోజుల పాటు కొనసాగనున్నాయి.

Yoga Utsa In Hyderabad 2

ఈ యోగా వేడుకల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. మరో 25 రోజుల్లో యోగ డే సందర్భంగా..  కౌంట్ డౌన్ యోగ దినోత్సవ వేడుకలను ఈ రోజు నుంచి నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దేశంలోని 75 ప్రాంతాల్లో సహా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా 75 రోజులు ఈ యోగ ఉత్సవ వేడుకలను నిర్వహించబోతున్నామని ప్రకటించారు. జూన్ 21 వరకు ప్రతి ఈ వేడుకలు నిర్వహించి.. అంతర్జాతీయ యోగ దినోత్సవంగా జూన్ 21న ట్యాంక్ బండ్ వద్ద భారీ యోగ వేడుకను నిర్వహించబోతున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించారు.

ఇవి కూడా చదవండి

Yoga Utsa In Hyderabad 3

ప్రతి వృత్తిలో యోగా ను భాగం చేసుకోవాలని సూచించారు. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు అన్నీ జూన్ 21 యోగ వేడుకలు జరగ బోతున్నాయి.. భారత ప్రభుత్వం తరపున కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

Reporter: Navya Chaitanya, Tv9 Telugu

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..