Hyderabad Bathini Fish Prasadam: ఈ సంవత్సరం చేప ప్రసాదం పంపిణీ లేదు చేప ప్రసాదం కోసం హైదరాబాద్ రావొద్దు అని బత్తిని కుటుంబీకులు తెలిపారు. మృగశిర కార్తె వచ్చిందంటే ప్రతీ ఏటా హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ ఆస్తమా రోగులతో కిటకిటలాడుతుంది. బత్తిని వంశస్తులు ఆస్తమా రోగులకు చేప ప్రసాదం మందును పంపిణీ చేస్తారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి ప్రజలు వస్తారు. ప్రభుత్వం అనుమతితో చేప ప్రసాదం పంపిణీ ఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతుంది. కరోనా కారణంగా గత మూడేండ్లుగా చేప ప్రసాదం పంపిణీ వాయిదా పడుతూ వస్తుంది.
కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ వస్తుంది. చేప ప్రసాదం కోసం భారీ సంఖ్యలో ఆస్తమా రోగులు తరలివస్తారు. కావున చేప ప్రసాదం పంపిణీ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతుందని గత మూడేండ్లుగా చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి నిరాకరిస్తూ వస్తోంది. ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో ఆస్తమా రోగులకు ఈ ఏడాది మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తారని అందరూ భావించారు.
కానీ చివరి నిమిషంలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేయడం లేదని బత్తెన కుటుంబీకులు తెలిపారు. ఈ సంగతి తెలియక ఇతర రాష్ట్రాల నుండి పాతబస్తీ దూద్ బౌలిలోని బత్తిని సోదరుల ఇంటికి ప్రజలు ఉదయం నుంచి క్యూ కడుతున్నారు.. ఉదయం నుంచి ఇప్పటి వరకు వందల సంఖ్యలో ప్రజలను పోలీసులు తిరిగి వారి వారి స్వస్థలాలకు పంపిస్తున్నారు.
-నూర్ మహమ్మద్, టీవీ9 ప్రతినిధి, హైదరాబాద్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..