Hyderabad: నాలుగేళ్ల తర్వాత నగరంలో ఏవియేషన్‌ షో.. వింగ్స్ ఇండియా 2022 ఎప్పుడు ప్రారంభం కానుందంటే..

మరో అంతర్జాతీయ వేడుకకు భాగ్యనగరం సిద్ధమైంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, జెట్‌ ఫైటర్లు హైదరాబాద్‌ నగరవాసుల్ని కనువిందు చేయనున్నాయి.

Hyderabad: నాలుగేళ్ల తర్వాత నగరంలో ఏవియేషన్‌ షో.. వింగ్స్ ఇండియా 2022 ఎప్పుడు ప్రారంభం కానుందంటే..
Wingsindia 2022

Updated on: Mar 14, 2022 | 1:03 PM

మరో అంతర్జాతీయ వేడుకకు భాగ్యనగరం సిద్ధమైంది. దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, హెలికాప్టర్లు, జెట్‌ ఫైటర్లు హైదరాబాద్‌ నగరవాసుల్ని కనువిందు చేయనున్నాయి. ఈ విమానాలపండగకు బేగంపేట ఎయిర్‌పోర్టు  (Begumpet airport) వేదిక కానుంది. ఈమేరకు ఈనెల 24 నుంచి ‘వింగ్స్ ఇండియా-2022’  (wingsindia 2022)పేరుతో ఎయిర్‌ షోను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. నాలుగు రోజుల పాటు (మార్చి 27వరకు) ఈ ప్రదర్శనలు కొనసాగనున్నాయి. కాగా ఈ ప్రదర్శనల్లో దాదాపు 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటున్నారు. అదేవిధంగా ఆరువేలకు పైగా ట్రేడ్ విజిటర్స్, 50వేల మంది సందర్శకులు పాల్గొంటారని అంచనా వేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రిజిస్ట్రేషన్‌ ఎలా చేసుకోవాలంటే..

కాగా కరోనా కారణంగా నాలుగేళ్ల విరామం అనంతరం ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. విమానాల ప్రదర్శనలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే వారు వింగ్స్ ఇండియా వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తొలి మూడురోజులు ప్రముఖులు, వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. చివరిరోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనలను వీక్షించవచ్చు.

Also Read: Tollywood Movies: ఈ వారం థియేటర్లలో..ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..

Viral Video: ఇదెక్కడి పిచ్చిరా బాబు.. లైకుల కోసం ఇలా చేస్తారా.. పట్టు తప్పితే యమలోకానికే!

Cheapest Electric Car: ఎలక్ట్రిక్ కార్ ప్రియులకు శుభవార్త.. అత్యంత తక్కువ ధరలో MG E230..