Hyderabad: రవాణా శాఖ సంచలన నిర్ణయం.. వారందరి లైసెన్సులు రద్దు

|

Jan 01, 2023 | 2:45 PM

నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని ఐదు జోన్లలో 5819 లైసెన్సులను రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీఏ) రద్దు చేసింది. నార్త్ జోన్‌లో 1103, సౌత్‌లో 1151, వెస్ట్‌లో 1345, ఈస్ట్ జోన్‌లో 510 లైసెన్స్‌లు క్యాన్సిల్ చేసింది.

Hyderabad: రవాణా శాఖ సంచలన నిర్ణయం.. వారందరి లైసెన్సులు రద్దు
Drunk And Drive
Follow us on

డిసెంబర్ 31. తాగారు. ఆడారు. పాడారు. మత్తులో ఊగి తేలారు. అంతవరకు ఓకే కానీ.. అతి ప్రమాదం అని చెప్పినా.. పోలీసులు వార్నింగ్ ఇచ్చినా సరే.. తాగి వాహనాలు నడిపారు. నో రూల్స్‌…డోంట్‌ కేర్‌ అంటున్నారు వాహనదారులు. ఒకరు చేసే నిర్లక్ష్యం..మరొకరి ప్రాణాలు బలితీసుకుంటోంది. మద్యం  మత్తు, అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ అమాయకుల ప్రాణాలను హరిస్తోంది. ఇంకా ఎన్నాళ్లూ ఇలా..?. అందుకే సీరియస్ అయ్యింది రవాణా శాఖ. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు నగర పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు సిటీలోని అనేక చోట్ల నిర్వహించిన టెస్టుల్లో మొత్తం 5,819 మంది పట్టుబడ్డారు. వీరందరి లైసెన్సులు రద్దు చేస్తున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది. నార్త్ జోన్ లిమిట్స్‌లో 1103 లైసెన్స్‌లు, సౌత్ జోన్ లిమిట్స్‌లో 1151 లైసెన్స్‌లు, వెస్ట్ జోన్‌లో 1345 లైసెన్స్‌లు, ఈస్ట్ జోన్‌లో 510 లైసెన్స్‌లతోపాటు, సెంట్రల్ జోన్‌లో కూడా పలువురి లైసెన్స్‌లు రద్దు చేశారు. 2021 సంవత్సరంతో పోలిస్తే మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు పాల్పడిన వారి లైసెన్స్‌లు 3,220 ఎక్కువగా ఉన్నాయని జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ పాండురంగ నాయక్ వెల్లడించారు.

మరిన్ని హైదరాబాద్ న్యూస్ కోసం