Gachibowli Accident: మత్తే మానసల జీవితాలను చిత్తు చేసింది.. తాగి నడపడంతోనే ప్రమాదం

కారు రెండు ముక్కలైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన ప్రమాదంలో తుక్కుతుక్కైంది. అంటే కారు స్పీడ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.

Gachibowli Accident: మత్తే మానసల జీవితాలను చిత్తు చేసింది.. తాగి నడపడంతోనే ప్రమాదం
Gachibowli Road Accident

Updated on: Dec 18, 2021 | 12:16 PM

కారు రెండు ముక్కలైంది. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన ప్రమాదంలో తుక్కుతుక్కైంది. అంటే కారు స్పీడ్ ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. వెనుక భాగం, ముందు భాగం.. కారు 2 పార్ట్స్‌ విడిపోయింది. చెట్టును ఢీకొనడంతో.. ఆ చెట్టు కూడా డ్యామేజ్ అయ్యింది. అక్కడి దృశ్యాలను చూస్తే కారు ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో మనకు అర్థం అవుతుంది. వద్దురా బాబు అంటే వినడం లేదు, తాగి బండి నడపకండిరా అంటే అర్థం కావడం లేదు, అర్ధరాత్రి వరకు పీకల దాకా తాగడం, ఆపై రోడ్డెక్కడం. ఈ క్రమంలో గచ్చిబౌలి ప్రాంతంలో జరిగిన కారు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. హెచ్‌సీయూ దగ్గర కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో అందులో ప్రయాణిస్తున్న M.మానస, N.మానస, అబ్దుల్ రహింలు ప్రాణాలు కోల్పోయారు.

తాగి బండి నడిపిన కారణంగానే ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఉదయం షూటింగ్ కోసం జేవీ కాలనీలో ఉండే సాయిసిద్ధు ఇంటికి అమీర్‌పేట నుంచి వచ్చారు M.మానస, N.మానస, అబ్దుల్ రహిం. రాత్రి సాయి నివాసంలో మద్యంగా సేవించారు. ఆపై టీ తాగేందుకు లింగంపల్లి అలిండ్ కంపెనీ వైపు వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆ రాత్రి వారు ఇంటి నుంచి ఎందుకు బయటకు వచ్చారు? సాయిసిద్దు ఇంటికి ఈ ముగ్గురు ఎందుకు వచ్చారు? సీరియల్ షూటింగేనా? అందులో ఏదైనా మతలబు ఉందా? అర్థరాత్రి ఎందుకు రోడ్డెక్కారు? అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

ప్రమాదం అనేక అనుమానాలు తలెత్తిస్తోంది. నగరంలో కారు హైరింగ్ ప్రమాద ఘంటికలు మోగిస్తోందా? హైరింగ్ అంటే కారు ఇష్టం వచ్చినట్లు నడపవచ్చా? కారుపై ఉన్న 15 వేల రూపాయల చాలన్స్ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయా?.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.

మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్. మానస, కర్నాటకకు చెందిన N.మానస, విజయవాడకు చెందిన బ్యాంక్‌ ఉద్యోగి అబ్దుల్‌ రహీం యాక్సిడెంట్‌ స్పాట్‌లోనే ప్రాణాలు విడిచారు.

Also Read:  వివాహేతర సంబంధం బయటపెడతానని భయపెట్టి వివాహితపై బాలుడు అత్యాచారం

Viral Video: జర ఆగు కాక.. శోభనానికి ముహూర్తం వేరే ఉంది.. ఏందీ దూకుడు