HMDA plots Action: భూముల వేలం HMDAకు కలిసొస్తుందా? ఉప్పల్ ఫ్లాట్ల వేలం ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం!

|

Dec 04, 2021 | 9:13 AM

ఉప్పల్‌ భగాయత్‌లో మూడో దశలో ప్లాట్ల వేలం ద్వారా హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(hmda)కు కాసుల వర్షం కురిపించింది. ఫ్లాట్ల వేలంలో రూ.474 కోట్ల ఆదాయం హెచ్ఎండీఏకు లభించింది.

HMDA plots Action: భూముల వేలం HMDAకు కలిసొస్తుందా? ఉప్పల్ ఫ్లాట్ల వేలం ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం!
Hmda
Follow us on

HMDA Uppal Bhagayath plots Action: విశ్వ నగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో పెరిగిపోతున్న జనాభా, ట్రాఫిక్, కాలుష్యం వల్ల సిటీ శరవేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో శివార్లల్లో మినీ శాటిలైట్ సిటీలను అభివృద్ధి చేయాలని హెచ్ఎండీఏ ప్లాన్​చేస్తోంది. ఇందుకోసం దాదాపు వేల ఎకరాల భూములను సమీకరించి, అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే ఉప్పల్‌ భగాయత్‌లో మూడో దశలో ప్లాట్ల వేలం ద్వారా హైదరాబాద్‌ మహా నగరాభివృద్ధి సంస్థ(hmda)కు కాసుల వర్షం కురిపించింది. ఫ్లాట్ల వేలంలో రూ.474 కోట్ల ఆదాయం హెచ్ఎండీఏకు లభించింది. మొదటి రోజు గరిష్టంగా చదరపు గజం లక్ష రూపాయలకు పైగా పలికింది. రెండో రోజైన ఇవాళ జరిగిన వేలంలో గరిష్టంగా గజం రూ.72వేలు పలికింది. కనిష్టంగా రూ.36వేలు ధర పలికినట్టు అధికారులు వెల్లడించారు.

నగరం నడిబొడ్డున ఉన్న జూబ్లీహిల్స్ భూములతో శివారులో మూసి ఒడ్డున ఉన్న ఉప్పల్ భూములు పోటీ పడ్డాయి. మూడో దశలో భాగంగా ఉప్పల్ భగాయత్‌లో 44 ప్లాట్లను HMDA, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ MSTC వేదికగా ఆన్ లైన్ వేలం పెట్టింది. అంచనాలను తలకిందులు చేస్తూ.. గజం ధర లక్ష దాటింది. 65,247 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 16 ప్లాట్ల వేలంతో ఇవాళ హెచ్ఎండీఏకు రూ.333 కోట్ల ఆదాయం వచ్చింది. మొదటి రోజు రూ.141. 61 కోట్ల ఆదాయం వచ్చింది. దీనితో కలిపి మొత్తంగా 84,966 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 39 ప్లాట్ల విక్రయంతో రూ.474.61 కోట్ల ఆదాయం లభించింది. సగటున గజం రూ. 55,859 రూపాయలు పలికినట్లు అధికారులు వెల్లడించారు.

గతంలో షేక్‌పేట్‌లో లక్షా 20 వేలు పలికిన రేటుకు పోటీ ఇది. తొలిరోజు 23 ప్లాట్లకు వేలం జరగగా.. 141 కోట్ల 61 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. వాటిలో రెండు ప్లాట్లు ఏకంగా గజం లక్షా వెయ్యి రూపాయిల రికార్డు ధర పలికింది. ఇక రెండో రోజు కూడా వేలం పాట జోరుగా సాగింది. 16 ప్లాట్లకు 333 కోట్ల ఆదాయం చేకూరింది. రెండో రోజు అత్యధికంగా చదరపు గజం 72 వేల రూపాయలు పలికింది. మొత్తంగా 39 ప్లాట్లకు ఆన్‌లైన్ వేలం ద్వారా 474 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. ఒకప్పుడు ఉప్పల్ అంటే చెట్లు, తుప్పలు, మూసీ.. కాని ఇప్పుడు ఉప్పల్‌ ముఖచిత్రమే మారిపోయింది. మెట్రో.. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు.. మూసీ బ్యూటీఫికేషన్‌.. వరంగల్‌-విజయవాడ హైవేలు.. యాదాద్రి, రాచకొండలో అభివృద్ధి వెరసి ఉప్పల్‌ భూములకు రెక్కలొచ్చాయి.

HMDA డెవలపడ్ వెంచర్ కావడంతో ఎలాంటి లీగల్ చిక్కులు ఉండవన్న భావన కూడా కొనుగోలుదారులను క్యూ కట్టేలా చేసింది. భవిష్యత్‌లో ఉప్పల్ మరింత డెవలప్ అవుతుందన్న ఆశాభావంతో ఎన్నారైలు, స్థానిక రియల్టర్లు, బిల్డర్లు, డెవలపర్లు పెద్దఎత్తున వేలంలో పాట పాడారు. గతంలోనూ HMDA భూముల వేలంలో అత్యధికంగా అత్తాపూర్‌లో గజం ధర లక్షా 53 వేలు పలికింది. మాదాపూర్‌లో లక్షా 52 వేలు, షేక్ పేట్‌లో లక్షా 20 వేలు.. ఇప్పుడు అదే బాటలోఉప్పల్‌ భగాయత్‌లో రికార్డులు లగెత్తాయి. మొత్తంగా ఖాళీ స్థలాలను లేఅవుట్లుగా అభివృద్ధి చేసి విక్రయిస్తున్న హెచ్ఎండీఏకు వేలం ప్రక్రియ కలిసొస్తుంది.

Read Also… Konijeti Rosaiah: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత