Corona Tests: ప్రస్తుతం మంచి జరగడం కంటే మోసం జరగడం ఎక్కువైపోతోంది. కరోనా టెస్టుల పేరుతో శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడ్డగోలు దోపిడీ జరుగుతోంది. కరోనా పరీక్షల పేరుతో ప్రయాణికుల నుంచి అధికంగా వసూలు చేస్తూ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్నారు సిబ్బంది. కరోనా పరీక్షలపై జారీ చేసిన జీవోలు కాగితానికే పరిమితమవుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఐదు రేట్లు ఎక్కువ మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఆర్‌టీపీసీఆర్ పరీక్షకు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.800 ఉండగా, ఎయిర్ పోర్టులో సిబ్బంది మాత్రం ప్రయాణికుల నుంచి రూ.4,200 వసూలు చేస్తున్నారు.
కోవిడ్ పరీక్షల పేరుతో అధికంగా వసూలు చేయడంపై ప్రయాణికుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే అధికంగా వసూలు చేయడం ఏమిటని, ఈ విషయంలో ఎవరు కూడా పట్టించుకోవడం లేదని ప్రయాణికులు మండిపడుతున్నారు. అయితే ఇలాంటి ఘటనలు ప్రైవేటు ఆస్పత్రుల్లో జరుగుతుండగా, తాజాగా ఎయిర్‌పోర్టుల్లో కూడా జరుగుతోంది. కరోనా పరీక్షల పేరుతో జనాల నుంచి అధికంగా డబ్బులు వసూలు చేయరాదని ఇది వరకే అధికారులు హెచ్చరికలు జారీ చేయగా, అలాంటిదేమి పట్టించుకోవడం లేదు. ఎయిర్‌పోర్టులో పరీక్షలకు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: అన్ని రాష్ట్రాలకు చేరుకున్న కోవిడ్ వ్యాక్సిన్.. తెలుగు రాష్ట్రాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి