Telangana: తెలంగాణ వీఆర్ఏలకు ఊరట.. చర్చలకు ఆహ్వాహించిన మంత్రి కేటీఆర్..

|

Sep 13, 2022 | 1:49 PM

అదే సమయంలో మరి కొంతమంది వీఆర్ఏలు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి అసెంబ్లీ వైపుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసులను

Telangana: తెలంగాణ వీఆర్ఏలకు ఊరట.. చర్చలకు ఆహ్వాహించిన మంత్రి కేటీఆర్..
Vra
Follow us on

Telangana: వీఆర్‌ఏల ఆందోళనకు తెలంగాణ ప్రభుత్వం దిగొచ్చిందని తెలుస్తోంది. 15 మంది వీఆర్‌ఏలను మంత్రి కేటీఆర్‌, సీఎస్ సోమేశ్ కుమార్ చర్చలకు పిలిచారు. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం వీఆర్‌ఏలు 50రోజులకి పైగా ఆందోళన చేస్తున్నారు. జిల్లాల వ్యాప్తంగా తహసీల్దార్‌ కార్యాలయాల ఎదుట శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిరవధిక సమ్మెకు దిగారు. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రధానంగా వారు డిమాండ్ చేస్తున్నారు. పేస్కేల్‌ను అమలు చేయాలి.. అర్హత కలిగిన వీఆర్‌ఏలకు పదోన్నతులు ఇవ్వాలి, 55 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వా లని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే మంగళవారం రోజున తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వీఆర్‌ఏలు, టీచర్ల అసెంబ్లీ ముట్టడితో హైటెన్షన్‌ నెలకొంది. వీఆర్‌ఏ జేఏసీ ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ ముట్టడి ఉద్రిక్తతకు దారి తీసింది. ఛలో అసెంబ్లీ ముట్టడిలో భాగంగా వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్ద వీఆర్ఏలు అసెంబ్లీకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీఆర్‌ఏల సంఘాలు పెద్ద ఎత్తున వీఆర్ఏలు తరలిరావడంతో పోలీసులు అదుపు చేయలేకపోయారు. ఈ నేపథ్యంలో వీఆర్ఏలకు- పోలీసులకు తీవ్ర తోపులాట జరిగింది. పోలీసులను తోసుకుంటూ వెళ్లి అంబేద్కర్ విగ్రహం వద్ద చౌరస్తాలో బైఠాయించారు వీఆర్‌ఏలు.

అదే సమయంలో మరి కొంతమంది వీఆర్ఏలు తెలుగు తల్లి ఫ్లైఓవర్ ఎక్కి అసెంబ్లీ వైపుగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. భారీగా మోహరించిన పోలీసులను దాటుకుని ముందుకు వెళ్లటం వీలు కాలేదు. దాంతో వీఆర్ఏలు అంబేద్కర్ విగ్రహం చౌరస్తా వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి వీఆర్ఏలను ముందుకు వెళ్లకుండా ఎక్కడికక్కడే అడ్డుకున్నారు. ఇందిరాపార్క్, తెలుగుతల్లిఫ్లైఓవర్‌, అసెంబ్లీ వద్ద అరెస్టుల పర్వం కొనసాగింది. వందల మంది ఆందోళనకారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. ఇందిరాపార్క్ నుంచి ర్యాలీగా అసెంబ్లీ ముట్టడికి యత్నించిన వీఆర్‌ఏలు పేస్కేల్‌ అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో సీఎం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే ఎక్కడికక్కడ అరెస్ట్‌లు.. లాఠీఛార్జ్‌తో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది.

ఇదిలా ఉంటే, రెడ్డి కార్పొరేషన్‌ కోసం రెడ్డి సంఘం ఆందోళనకు దిగారు. ఇవాళ మొత్తం 7 సంఘాలు అసెంబ్లీ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో హైదరాబాద్‌ అసెంబ్లీ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. హోరెత్తిన ఆందోళనలతో అసెంబ్లీ పరిసరాల్లో భారీ ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడింది.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి