Hyderabad: అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత..

|

Dec 22, 2024 | 6:02 PM

విద్యార్థి సంఘాల ఆందోళనతో జూబ్లీహిల్స్‌లోని నటుడు అల్లు అర్జున్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకుంది. రేవతి మరణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ స్టూడెంట్స్ పెద్ద నినాదాలు చేశారు. రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Hyderabad: అల్లు అర్జున్ ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత..
Allu Arjun
Follow us on

అల్లు అర్జున్‌ ఇంటి దగ్గర టెన్షన్‌ వాతావరణం నెలకుంది. ఆయన నివాసం ముందు  ఓయూ జేఏసీ నిరసనకు దిగింది.
ఇంట్లోకి వెళ్లి పూలకుండీలు పగలగొట్టారు నిరసనకారులు. కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవతి మరణానికి అల్లు అర్జున్‌ కారణమంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. జేఏసీ నేతలను సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ క్రమంలో కాంపౌండ్‌ వాల్‌ ఎక్కి అల్లు అర్జున్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు స్టూడెంట్స్. పుష్ప2 ప్రిమియర్ రోజు జరిగిన తొక్కిసలాటలో చనిపోయిన రేవతి కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అల్లు అర్జున్‌ సెక్యూరిటీ, నిరసనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకుంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని.. నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలతో అల్లు అర్జున్‌ ఇంటి దగ్గర భద్రత పెంచారు పోలీసులు.

సంధ్య థియేటర్‌ ఘటనపై మాటల యుద్ధం కొనసాగుతుండగా.. ఫ్యాన్స్‌కు కీలక సూచనలు చేశారు ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్. ఫ్యాన్స్‌ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. ఎవరినీ కించపరిచేలా పోస్టులు పెట్టకూడదని సూచించారు. కొన్ని రోజులుగా ఫ్యాన్స్‌ ముసుగులో ఫేక్‌ ప్రొఫైల్స్‌తో పోస్టులు పెడుతున్నారని..  అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. నెగెటివ్‌ పోస్టులు పెట్టేవారికి దూరంగా ఉండాలని ఫ్యాన్స్‌కు సూచించారు అల్లు అర్జున్‌.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి