తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. 48 గంటల్లో అది వాయుగుండంగా మారుతుందని వారి అంచనా. దీనితో జూలై 1,2 తేదీల్లో తెలంగాణాలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. కాగా శనివారం, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు పడవచ్చని ఆయన అన్నారు.