
హైదరాబాద్, అక్టోబర్ 5: హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారు జామున భారీ వర్షం కురిసింది. ఉదయం 7 గంటలు మొదలు బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్, ఫిల్మ్ నగర్, ఖైరతాబాద్, అమీర్‌పేట, యూసఫ్‌గూడ, లక్డీకపూల్, నాంపల్లి, కోఠి, సుల్తాన్‌బజార్, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, నారాయణగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, నెక్లెస్‌రోడ్ తోపాటు నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. క్యూములో నింబస్ మేఘాల ప్రభావంతో హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఈ మేరకు వర్షం దంచి కొడుతుంది.
రోడ్లమీదకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచిస్తుంది. పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మూసాపేట్, బేగంపేట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షం కురుస్తుంది. వర్షాల కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ మళ్ళిస్తున్న పోలీసులు. శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారి చెరువుని తలపిస్తోంది. పలు అపార్ట్మెంట్లోకి వరద నీరు చేరుకుంది.
HyderabadRains ALERT 1 ⚠️⛈️
Dear people of Hyderabad. GET READY FOR MORNING THUNDERSTORM. North, West HYD towards Patancheru, RC Puram, Serlingampally, Gachibowli, Miyapur, Kukatpally, Gajularamaram, Nizampet, Qutbullapur, Jeedimetla, Suchitra, Alwal, Malkajgiri, Kapra,…
— Telangana Weatherman (@balaji25_t) October 5, 2025
కాగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో మరో 2 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పటాన్‌చెరు, ఆర్సీపురం, శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మియాపూర్, కూకట్‌పల్లి, నిజాంపేట, జీడిమెట్ల, సుచిత్ర, అల్వాల్, మల్కాజిగిరి, కాప్రా, బొల్లారంలో వాన కురవనున్నట్లు తెలిపింది. తెలంగాణలోని అనేక జిల్లాల్లో ఈరోజు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ రోజు మధ్యాహ్నం, సాయంత్రం నాటికి వర్షం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉన్నందున జనాలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని అధికారులు కోరారు. ఈ క్రమంలో హైదరాబాద్ సహా తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.