Hyderabad: నగరంలో ఈ రోజు రాత్రి భారీ వర్షం.. సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన GHMC

|

Jun 24, 2022 | 9:59 PM

భాగ్యనగరంలో ఈ రోజు రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో జీహెచ్‌ఎంసీ అలెర్ట్ అయ్యింది.

Hyderabad: నగరంలో ఈ రోజు రాత్రి భారీ వర్షం..  సాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చిన GHMC
Hyderabad Rains
Follow us on

Telangana Rains: భాగ్యనగరంలో  శుక్రవారం రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారీ వర్షపాతం నమోదవ్వొచ్చన్న హెచ్చరికల నేపథ్యంలో… మాన్సూన్ యాక్షన్ టీమ్స్‌ను అప్రమత్తం చేశారు హైదరాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి(Gadwal Vijayalakshmi ). వర్షాలు కురుస్తున్న పలు ప్రాంతంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సహాయక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించించారు మేయర్స్. ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. కూకట్ పల్లి(Kukatpally), మియాపూర్, బాలానగర్, జూబ్లిహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, మెహదీపట్నం, అల్వాల్, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. హైదరాబాద్-ఉప్పల్, చిలుకా నగర్, బొడుప్పల్ పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. సిటీలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించనుంది వర్షం. రాత్రి వాన కంటిన్యూ అయ్యే అవకాశం ఉండటంతో  జీహెచ్ఎంసీ కూడా అలెర్టయ్యింది. సహాయం కోసం DRF టోల్ నెంబర్ 040-29555500 నెంబర్ కి కాల్ చేయాలనీ సూచించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అత్యవసరం అయితే బయటకు వెళ్లవద్దని సూచించింది.

మ్యాన్ హోల్ మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు

వర్షపు నీరు నిలిచే ప్రాంతాలను నిత్యం మోనేటర్ చేయాలని, డ్రైనేజీ పనులకు సంబంధించిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించేలా చూడాలని సిబ్బందికి జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశాలు జారీ చేశారు. మ్యాన్ హోల్ మూతలు తెరవొద్దని ప్రజలను హెచ్చరించారు. మ్యాన్ హోల్ మూత తెరవడం జలమండలి యాక్ట్ లోని సెక్షన్ 74 ప్రకారం నేరమని, ఎవరైనా మ్యాన్ హోల్ మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు పెడతామని  వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడైనా నీరు నిలిచినా, మ్యాన్ హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నా జలమండలి కస్టమర్ కేర్ నెంబరు 155313కి ఫోన్ చేయాలని సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి