Hyderabad: జిమ్‌ ట్రైనింగ్‌ పేరుతో మహిళను లోబర్చుకున్న ట్రైనర్‌.. తీరా పెళ్లి అనే సరికి.

హైదరాబాద్‌ పాత బస్తీలో దారుణం జరిగింది. జిమ్‌ శిక్షణ పేరుతో మహిళను లోబర్చుకొని లైంగిక దాడి చేశాడు ఓ ట్రైనర్‌. ఈ దారుణ సంఘటన ఓల్డ్‌ సిటీలోని టోలిచౌకిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకిలో ఆసిమ్‌ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా జిమ్‌ నడిపిస్తున్నాడు. అతనే జిమ్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తూ జిమ్‌ సెంటర్‌ను రన్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం అదే ప్రాంతంలో..

Hyderabad: జిమ్‌ ట్రైనింగ్‌ పేరుతో మహిళను లోబర్చుకున్న ట్రైనర్‌.. తీరా పెళ్లి అనే సరికి.
Representative Image

Updated on: Jun 16, 2023 | 8:58 AM

హైదరాబాద్‌ పాత బస్తీలో దారుణం జరిగింది. జిమ్‌ శిక్షణ పేరుతో మహిళను లోబర్చుకొని లైంగిక దాడి చేశాడు ఓ ట్రైనర్‌. ఈ దారుణ సంఘటన ఓల్డ్‌ సిటీలోని టోలిచౌకిలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. టోలిచౌకిలో ఆసిమ్‌ అనే వ్యక్తి గత కొన్నేళ్లుగా జిమ్‌ నడిపిస్తున్నాడు. అతనే జిమ్‌ ట్రైనర్‌గా వ్యవహరిస్తూ జిమ్‌ సెంటర్‌ను రన్‌ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఏడాది క్రితం అదే ప్రాంతంలో నివాసముంటున్న ఓ యువతి జిమ్‌లో చేరింది.

శిక్షణ పేరుతో క్రమంగా సదరు యువతితో పరిచయం పెంచుకున్న ఆసీమ్‌ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెపై లైంగిక దాడికి దిగాడు. తీరా పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి పరార్‌ అయ్యాడు. పెళ్లి లేదు ఏం లేదంటూ ముఖం చాటేశాడు. మోసపోయానని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది. తనను నమ్మించి లైంగికంగా వాడుకున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. నిందితుడిపై ఐపీసీ 376, 417,420, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..