Telangana: తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా అవతరణ దినోత్సవ వేడుకలు.. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌

| Edited By: Ravi Kiran

May 13, 2023 | 9:58 PM

ఈసారి తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు నిర్వహించనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై శనివారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో..

Telangana: తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా అవతరణ దినోత్సవ వేడుకలు.. ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌
CM KCR
Follow us on

ఈసారి తెలంగాణ అవతరణ వేడుకలను ఘనంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. జూన్‌ 2 నుంచి 21 రోజులపాటు నిర్వహించనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణ విధివిధానాలపై శనివారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి పలు కీలక విషయాలను వెల్లడించారు. పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తొమ్మిదేండ్ల అనతికాలంలోనే దేశానికే ఆదర్శంగా పాలన కొనసాగిస్తూ, పదవ వసంతంలోకి అడుగిడుతున్న చారిత్రక సందర్భంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను అత్యంత వైభవోపేతంగా, ఘనంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు.

ఈ ఉత్సవాలు తెలంగాణ సమాజ ఆకాంక్షలకు అనుగుణంగా, తెలంగాణ ఘనకీర్తి దశ దిశలా చాటేలా, ప్రతి హృదయం ఉప్పొంగేలా పండుగ వాతావరణంలో నిర్వహించాలని సిఎం సూచించారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ వరకు, రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2వ తారీఖు నుంచి 21 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయని సిఎం తెలిపారు. ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు గారి ఆధ్వర్యంలో డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో మొదటి రోజు ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాష్ట్ర మంత్రులు, వారి వారి జిల్లా కేంద్రాల్లో ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతారు.

ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని 2023 జూన్ 2వ తేదీ నాటికి, తొమ్మిదేండ్లు పూర్తి చేసుకుని 10వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. పెద్ద ఎత్తున పోరాటాలు, ఎన్నో కష్టాల తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అతి పిన్న వయస్సుగల రాష్ట్రం. అయినా కూడా ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో, సమిష్టి కృషితో నేడు తెలంగాణ అన్ని రంగాల్లో అత్యద్భుతంగా ఫలితాలను సాధిస్తూ ప్రగతి ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. నేడు తెలంగాణ దేశానికే ఒక రోల్ మోడల్‌గా మారింది. మన ప్రగతిని చూసి ఇతర రాష్ట్రాల వారు ఆశ్చర్యానికి గురవుతున్నారు. మహారాష్ట్ర, ఉత్తరాది రాష్ట్రాల నాయకులు, ప్రజలు మన రాష్ట్రం సాధిస్తున్న అభివృద్ధి గురించి విని, చూసి ఆశ్చర్యపోతున్నారు’ అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అభివృద్ధిని సాధించడమే కాకుండా సాధించిన అభివృద్ధి ఫలితాలను ప్రజలకు అందేలా చూడడంలో దార్శనికతను ప్రదర్శించాల్సి వుంటుందని సీఎమ్‌ తెలిపారు. అప్పుడే ప్రగతి ప్రస్థానం ఆగకుండా కొనసాగుతుందని తెలంగాణలో అదే జరుగుతున్నదని ముఖ్యమంత్రి అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు ముఖ్యంగా వ్యవసాయ రంగంలో అనుసరించాల్సిన అభివృద్ధి కార్యాచరణ పట్ల నిర్దిష్ట దృక్పథం, దూరదృష్టితో కూడిన సునిశిత కార్యాచరణ కొరవడిందని సీఎం అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..