మల్లన్నసాగర్ నిర్వాసితుల కేసులో హైకోర్టు సంచలన తీర్పు

| Edited By: Srinu

Jul 06, 2019 | 7:47 PM

మల్లన్న సాగర్ భూనిర్వాసితుల కేసులో కోర్టు ధిక్కరణపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సిద్దిపేట ఆర్డీవో, తొగుట తహసీల్దార్, మల్లన్న సాగర్ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌కి మూడు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో పాటు పునరావాసం, పునరుపాధి కల్పించకుండా అధికారులు ఆ ప్రాంతంలో పనులు చేయిస్తున్నారంటూ ముంపు ప్రాంత రైతులు, రైతు […]

మల్లన్నసాగర్ నిర్వాసితుల కేసులో హైకోర్టు సంచలన తీర్పు
Follow us on

మల్లన్న సాగర్ భూనిర్వాసితుల కేసులో కోర్టు ధిక్కరణపై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సిద్దిపేట ఆర్డీవో, తొగుట తహసీల్దార్, మల్లన్న సాగర్ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌కి మూడు నెలల జైలు శిక్ష విధించింది. జైలు శిక్షతో పాటు 2 వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు నిచ్చింది.

ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీతో పాటు పునరావాసం, పునరుపాధి కల్పించకుండా అధికారులు ఆ ప్రాంతంలో పనులు చేయిస్తున్నారంటూ ముంపు ప్రాంత రైతులు, రైతు కూలీలు హైకోర్టును ఆశ్రయించారు. వారి వాదనలు విన్న కోర్టు స్థానికంగా ఉన్న అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత తమకు సమాచారం ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అయితే కోర్టు ఆదేశాలను లైట్ తీసుకున్న అధికారులు సమస్యలను పరష్కరించకుండానే పనులు సమన్వయం చేశారు. దీంతో రైతులు మరోసారి కోర్టును ఆశ్రయించారు. వాదనలు విన్న కోర్టు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ జైలు శిక్షతో పాటు ఫైన్ వేసింది.