Gold Seized: అక్రమ రవాణాకు అడ్డాగా మారిన శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌.. రూ.74 లక్షల గోల్డ్‌, రూ.4 లక్షల సిగరెట్లు, బుల్లెట్లు..

|

Mar 03, 2021 | 12:14 PM

Gold Seized In Shamshabad Airport: శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమ రవాణాకు కేరాఫ్‌గా మారుతోంది. ఏదో ఒక అక్రమ రవణా వెలుగులోకి వస్తూనే ఉంది. ఇక బంగారం అక్రమ రవాణా ఇటీవల పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా..

Gold Seized: అక్రమ రవాణాకు అడ్డాగా మారిన శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌.. రూ.74 లక్షల గోల్డ్‌, రూ.4 లక్షల సిగరెట్లు, బుల్లెట్లు..
Follow us on

Gold Seized In Shamshabad Airport: శంషాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం అక్రమ రవాణాకు కేరాఫ్‌గా మారుతోంది. ఏదో ఒక అక్రమ రవణా వెలుగులోకి వస్తూనే ఉంది. ఇక బంగారం అక్రమ రవాణా ఇటీవల పెద్ద ఎత్తున జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో భారీ ఎత్తున బంగారాన్ని పట్టుకున్నారు.


కస్టమ్స్‌ అధికారులు తాజాగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన FZ-8779 నెంబర్‌ విమానంలో వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి 1593 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారాన్ని పేస్ట్‌ రూపంలో తరలిస్తుండగా అధికారులు గుర్తించి, పట్టుకున్నారు. అక్రంగా తరలిస్తున్న ఈ బంగారం విలువ రూ.74.87 లక్షలు ఉంటుందని అధికారులు చెప్పారు. ఆ మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. ఇక అబుదాబి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన EY 274 నెంబర్‌ విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడి నుంచి రూ.4 లక్షల విలువైన విదేశీ సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కలకలం సృష్టించిన బుల్లెట్లు..

బుధవారం ఉదయం శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా గురజాలకు చెందిన దంపతులు బుధవారం ఉదయం అమెరికాకు వెళ్తున్నారు. ఈ సమయంలో వారి బ్యాగ్‌ను స్కాన్‌ చేసి చూడగా.. వారి బ్యాగులో బుల్లెట్లు లభించాయి. దీంతో ఆ బుల్లెట్లను ఇగిగ్రేషన్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆ దంపతులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: Telangana CMO: తెలంగాణ సీఎంవోలో మొదలైన ప్రక్షాళన.. పీఆర్‌వో పదవి నుంచి విజయ్ తొలగింపు..

SCCL Job Notification : నిరుద్యోగులకు గుడ్ న్యూస్ .. 10వ తరగతి అర్హతతో సింగరేణి లో ఉద్యోగావకాశాలు

World Wildlife Day 2021 : నేడు ప్రపంచ వన్యప్రాణుల దినోత్సం.. ఈ ఏడాది థీమ్, ప్రాముఖ్యత ఏమిటంటే..!