Gold Cheating: వెండి ఉంగరాలకు బంగారు పూత.. హల్ మార్క్ గుర్తు. 200 మంది దగ్గర తాకట్లు.. @6 కోట్లు

హైదరాబాద్‌ బోరబండలో ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. నకిలీ బంగారంతో వ్యాపారులను బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు. వెండి ఉంగరాలకు

Gold Cheating: వెండి ఉంగరాలకు బంగారు పూత.. హల్ మార్క్ గుర్తు. 200 మంది దగ్గర తాకట్లు.. @6 కోట్లు
Gold Cheating

Updated on: Oct 02, 2021 | 9:49 AM

Gold Cheating – Hyderabad: హైదరాబాద్‌ బోరబండలో ఘరానా మోసం వెలుగులోకొచ్చింది. నకిలీ బంగారంతో వ్యాపారులను బురిడీ కొట్టించాడు ఓ కేటుగాడు. వెండి ఉంగరాలకు బంగారు పూత పూసి హల్ మార్క్ గుర్తు వేయించి తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటున్నాడు వెంకట్ రెడ్డి. బోరబండలో నగల వ్యాపారి గణేష్ చౌదరి వద్ద.. ఉంగరాలు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకెళ్లాడు వెంకట్ రెడ్డి. ఐతే చాలా రోజుల వరకు వెంకట్ రెడ్డి రాకపోవడంతో ఉంగరాలను కరిగించే ప్రయత్నం చేశారు వ్యాపారి గణేష్ చౌదరి.

మళ్లీ రెండు రోజుల క్రితం నకిలీ బంగారు ఉంగరాలు తీసుకొచ్చి తాకట్టు పెట్టే ప్రయత్నం చేశాడు వెంకటరెడ్డి. దీంతో అతన్ని పట్టుకొని ఎస్సార్ నగర్ పోలీసులకు అప్పజెప్పాడు నగల వ్యాపారి గణేష్ చౌదరి. ఇప్పటివరకు నగరంలో 200 మంది దగ్గర నకిలీ బంగారం ఆభరణాలు తాకట్టు పెట్టి 6 కోట్లకు పైగా డబ్బులు తీసుకున్నట్టు గుర్తించారు పోలీసులు. వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఎస్ ఆర్ నగర్ పోలీసులు. కాగా, సదరు వెంకటరెడ్డి బంగారు బాగోతాలు మరిన్ని వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Read also: CM YS Jagan: నేడు ఏపీలో క్లాప్‌ పథకం ప్రారంభం, మ.12 వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు. హైదరాబాద్‌, చెన్నై వెళ్లే వాహనాలు మళ్లింపు