GHMC: ఫేక్‌ బర్త్, డెత్ సర్టిఫికెట్లపై GHMC మేయర్‌ సీరియస్.. అత్యవసర భేటీకి ముందే అధికారులను చాంబర్‌కు పిలిచి ఫైర్

నకిలీ సర్టిఫికెట్లపై మేయర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే కమిషనర్‌కు విజిలెన్స్ అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. విజిలెన్స్ నివేదికలో ఇంటి దొంగల వివరాలను..

GHMC: ఫేక్‌ బర్త్, డెత్ సర్టిఫికెట్లపై GHMC మేయర్‌ సీరియస్.. అత్యవసర భేటీకి ముందే అధికారులను చాంబర్‌కు పిలిచి ఫైర్
GHMC Mayor Vijayalakshmi

Updated on: Mar 08, 2023 | 3:57 PM

ఫేక్‌ బర్త్, డెత్ సర్టిఫికెట్లపై జీహెచ్చ్ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి సీరియస్ అయ్యారు. సంబంధిత విభాగం అధికారులపై వేటు వేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎంఓహెచ్, స్టాటిస్టికల్, ఏఎంఓహెచ్చ్, ఏఎంసీలపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. నకిలీ సర్టిఫికెట్లపై మేయర్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే కమిషనర్‌కు విజిలెన్స్ అధికారులు ప్రాథమిక నివేదిక ఇచ్చారు. విజిలెన్స్ నివేదికలో ఇంటి దొంగల వివరాలను కూడా వెళ్లడించినట్లుగా సమాచారం. భాద్యులైన అధికారులను సొంత డిపార్ట్‌మెంట్‌లకు పంపాలా?.. సస్పెండ్ చెయ్యాలా..? అనే అంశంపై సమాలోచనలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అయితే, అత్యవసర భేటీకి ముందే సీఎంహెచ్‌ను మేయర్ విజయలక్ష్మి తన చాంబర్‌కు పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకిలా జరిగిందో చెప్పాలని.. లోపం ఎక్కడుందని మండిపడ్డారు. కమిషనర్ ఎదుటే సీఎంఓహెచ్చ్‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు మేయర్ విజయలక్ష్మి.

ఇక నకిలీ జనన, మరణ ధృవ పత్రాల ఇష్యూలో పురపాలక మంత్రి కేటీఆర్‌ను ఎందుకు ఆ పదవి నుంచి తప్పించలేదని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అదే వేరే వాళ్లు ఉండి ఉంటే.. సీఎం కేసీఆర్ యాక్షన్‌ మరోలా ఉండేదని సైటెర్లు వేశారాయన.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం