GHMC Standing Committee Meeting: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ స్టాండింగ్ కమిటీ మూడవ సమావేశం బుధవారం మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు ఆమోద ముద్ర వేశారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. లింక్ రోడ్లు, జంక్షన్ల అభివృద్ధి కి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు. ప్రతి జోన్‌లో ఆరు నుండి ఏడు జంక్షన్లను అభివృద్ధి చేయాలని స్టాండింగ్ కమిటీ నిర్ణయించిందన్నారు. అంతేకాకుండా పారిశుధ్య కార్మికుల ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని సూచించింది.
హైదరాబాద్ మహానగరంలో పారిశుద్ధ్యంతో పాటు భారీగా ఉత్పత్తి అవుతున్న భవన నిర్మాణ వ్యర్ధాలను పూర్తిస్థాయిలో పునర్వినియోగానికి మరో రెండు సీ అండ్ డీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ తెలిపారు. ఇందుకోసం త్వరలో టెండర్లను పిలువనున్నట్లు తెలిపారు. ప్రతి సి అండ్ డి ప్లాంట్ వద్ద ఎలక్ట్రానిక్ వే – బ్రిడ్జి మిషన్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతిరోజు జనరేట్ చేయడం జరుగుతుందని తెలిపారు. థర్డ్ పార్టీ ఏజెన్సీ పరిశీలన చేసి సర్టిఫికెట్ జారీ చేస్తుందని అన్నారు. కాగా, మూడవ స్టాండింగ్ కమిటీ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది.
స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించిన 40 అంశాలు…
* తీగల కుంట క్రాస్ రోడ్స్ నుండి తాడ్ బండ్ లేబర్ అడ్డా వయా ఇర్ఫాన్ హోటల్ నవాబ్ సాహెబ్ కుంట వరకు లింక్ రోడ్డుకు ఆమోదం
* మెట్రో బేకరీ నుండి అడిబా హోటల్ వరకు రోడ్డు వెడల్పు తో పాటుగా రాజేంద్రనగర్ – కొత్తపేట మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా భూసేకరణకు ఆమోదం
*ముస్కాన్ హోటల్ నుండి ( పిల్లర్ 213) కిస్మత్ పుర వయా గోల్డెన్ హైట్స్ వరకు కారిడార్ నంబర్ 127 లో ఆస్తుల సేకరణ ఆమోదం
* ఖాజాగూడ మెయిన్ రోడ్డు నుండి ఉర్దూ యూనివర్సిటీ వయా ఓక్రీట్జ్ స్కూల్ వరకురోడ్డు వెడల్పులో బాగంగా ఆస్తులు సేకరణసు ఆమోదం
* బొటానికల్ గార్డెన్ నుండి కొత్తగూడ మెయిన్ రోడ్డు వయా సఫరీనగర్ వరకు రోడ్డు వెడల్పులో భాగంగా ఆస్తులు సేకరణకు ఆమోదం
* హనుమాన్ టెంపుల్ నుండి అపర్ణాహిల్ పార్కు వయా గంగారం చెరువు వరకు విస్తీర్ణంలో రోడ్డు నిర్మాణానికి ఆస్తులు సేకరణ ఆమోదం
* హెచ్.టి లైన్ బేస్, కిస్మత్ పుర నుండి రాజేంద్రనగర్ కారిడార్ నెంబర్ 125 వరకు రొడ్డు అభివృద్దిలో ఆస్తుల సేకరణకు ఆమోదం
* ఐ.ఎస్.బి నుండి గోపన్ పల్లి హెచ్.సి.యు సౌత్ గేట్ వయా హైకోర్టు కాలనీ, హెచ్.సి.యు (గౌలిదొడ్డి) స్లిప్ రోడ్డు కారిడార్ నెంబర్ 10 విస్తీర్ణంలో రోడ్డు నిర్మాణానికి ఆమోదం.
* పిల్లర్ 123 నుండి అత్తాపూర్ విలేజ్ వరకు రోడ్డు వెడల్పులో బాగంగా ఆస్తుల సేకరణకు ఆమోదం
* పేట్ బషీర్ బాద్ (ఆర్.ఆర్.హాస్పిటల్) నుండి అంబేడ్కర్ నగర్ మెయిన్ రోడ్డు (సెయింట్ మైకేల్ స్కూల్) వరకు రోడ్లు వెడల్పుకు ఆమోదం.
* గిర్కపల్లి జంక్షన్ పల్లి (మొగల్ ఖా నాలా) నుండి పురానాపూల్ వరకు రోడ్డు విస్తీర్ణంకు ఆమోదం
* ఎన్.హెచ్ 44 కె.ఎస్.దివాన్ దాబా నుండి నర్సాపూర్ రోడ్, రంగాబుజంగా థియేటర్ వయా పైప్ లైన్ రోడ్డు సుభాష్ నగర్ వరకు రోడ్డు వెడల్పు ప్రతిపాదనలకు ఆమోదం.
* హబ్సిగూడ నుండి నాగోల్ ఇన్నర్ రింగ్ రోడ్డు వయా ఉప్పల్ జంక్షన్ వరకు 60 మీటర్ల రోడ్డుకు ప్రతిపాదన ఆమోదం.
* లక్కీ స్టార్ హోటల్ నుండి హఫీజ్ బాబా నగర్ వయా ఫూల్ బాగ్ మహ్మదీయ మజీద్ వరకు రోడ్ల వెడల్పుకు ఆమోదం
* మల్లాపూర్ జంక్షన్ వద్ద ఆర్.ఓ.బి పొడగింపునకు 60 మీటర్ల రోడ్డు విస్తీర్ణానికి భూసేకరణకు ఆమోదం
* నానక్ రామ్ గూడ రోటరి వద్ద జంక్షన్ అభివృద్ధి చేసి లింకును ఓ.ఆర్.ఆర్, కలుపుతూ కొత్త రోడ్డు చేపట్టి అనుసంధానం భూసేకరణకు ఆమోదం.
* శాంతి నగర్ నుండి మెట్టుగూడ ఆర్.ఓ.బి వరకు రోడ్డు వెడల్పు కోసం ఆమోదం.
* యాంప్రాల్ జంక్షన్ అభివృద్ధికి భూసేకరణ కొరకు ఆమోదం
* మల్కాజిగిరి ఆనంద్ బాగ్ జంక్షన్ జంక్షన్ అభివృద్ధి ఆమోదం
* ఉప్పల్ జంక్షన్ నుండి అంబర్ పెట్ ముక్కారం హోటల్, వయా రామంతపూర్ వరకు రోడ్డు వెడల్పుకు ఆమోదం.
* డబీర్ పుర దర్వాజ నుండి ఏ.పి ట్రిబ్యునల్ కోర్టు వరకు కు ఆమోదం.
* బంజారా దర్వాజ నుండి నాయక్ ఖిల్లా వయా గోల్కొండ పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు వెడల్పు ఆమోదం.
* వరల్డ్ 1 ఇంటర్నేషనల్ స్కూల్ నుండి వసంత్ సిటీ రోడ్డు వరకు 30 మీటర్ల రోడ్డు వెడల్పునకు ఆమోదం
* సైనిక్ పురి జంక్షన్ వద్ద Y జంక్షన్ అభివృద్దికి ఆమోదం.
* షీనాయ్ నర్సింగ్ హోం వద్ద జంక్షన్ అభివృద్దికి ఆమోదం
* సిలికాన్ జంక్షన్ వద్ద T జంక్షన్ అభివృద్దికి ఆమోదం
* ఓల్డ్ హయత్ నగర్ వద్ద జంక్షన్ అభివృద్దికి ఆమోదం
* చక్రీపురం జంక్షన్ వద్ద Y జంక్షన్ అభివృద్దికి ఆమోదం
* యూసుఫ్ గూడ బస్తీ, క్రిష్ణకాంత్ పార్క్ జంక్షన్ వద్ద అభివృద్దికి ఆమోదం
* జెడ్.టి.సి జంక్షన్ వద్ద టీ-జంక్షన్ అభివృద్దికి ఆమోదం.
* బంజారా దర్వాజ నుండి ఫతేదర్వాజ వరకు 18 మీటర్ల రోడ్డు వెడల్పునకు ఆమోదం
* కాచిగూడ జంక్షన్ వద్ద జంక్షన్ అభివృద్దికి ఆమోదం.
* జమామజీద్ చౌక్, లాడ్ బజార్ జంక్షన్v వద్ద టీ-జంక్షన్ అభివృద్ధికి ఆమోదం
* వై.ఎం.సి.ఏ జంక్షన్ అభివృద్దికి ఆమోదం
* ఆలీకేఫ్ జంక్షన్ అభివృద్దికి ఆమోదం
* శివమ్ జంక్షన్ వద్ద జంక్షన్ అభివృద్దికి ఆమోదం
* బర్కత్ పుర జంక్షన్ అభివృద్ధికి ఆమోదం
* మాణికేశ్వర్ నగర్ నుండి ఇందిరానగర్ వయా ఆర్.యు.బి రైల్వే లైన్ వరకు రోడ్ల వెడల్పునకు ఆమోదం.
* ఖైరతాబాద్ జోన్ సర్కిల్ నెంబర్ 18 బంజారాహిల్స్ వార్డు నెంబర్ 93, ఎన్.బి.టి నగర్ వద్ద మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.5.90 కోట్లు ఆమోదం
* ఖైరతాబాద్ జోన్ సర్కిల్ నెంబర్ 18 రోడ్ నెంబర్ 13 వార్డు నెంబర్ 93లోని శ్మశానవాటికలో రూ.2.20 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే అధునాతన సదుపాయాలతో క్రిమిటోరియం నిర్మాణానికి ఆమోదం.
హైదరాబాద్ మహానగరంలో పెరగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక సదుపాయాలపై జీహెచ్ఎంసీ పాలక మండలి ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సిటీలో వాహనాల రద్దీ తగ్గించేందుకు లింక్ రోడ్లను, జంక్షన్లు అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది.
Read Also…. Harish Rawat: సొంతపార్టీ నేతలే అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు.. కాంగ్రెస్ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు!