Talasani Srinivas Yadav: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. ఈనేపథ్యంలో ఏర్పాట్లను షూరు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. HMDA, ట్రాన్స్ పోర్టు. వాటర్ బోర్డు, హెల్త్ డిపార్మెంట్ అధికారుల సహాకారంతో… వినాయక నిమజ్జనాలపై రూట్ మ్యాప్ తయారు చేశారు. శనివారం సాయంత్రం నుండి అనేక రూట్లలో ట్రాఫిక్ మళ్లించి.. వినాయక విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి తలసాని.
ట్యాంక్ బండ్ పై మొత్తం 40క్రేన్లు 19వేల మంది పోలీసులతో, ghmc, hmda సహకారంతో నిమజ్జన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం అయ్యే క్రేన్ నెంబర్ 8 దగ్గర నీటి లోతుని పెంచుతున్నారు. అడుగులోతు ఉన్న పూడికతీత చేపట్టారు. ఇలా ఉండగా, హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనాలకు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. అయితే, ఈ ఒక్క ఏడాదికి మాత్రమే మినహాయింపులను ఇస్తున్నామని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టేసింది.
కాగా, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీవోపీ) విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి వీల్లేదంటూ తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే. రబ్బర్ డ్యామ్ లను నిర్మించాలని ఆదేశించింది. అయితే, ఇప్పటికిప్పుడు అది అయ్యే పనికాదని జీహెచ్ఎంసీ చెప్పినా హైకోర్టు తిరస్కరించింది. దీంతో టీ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది.