Sri Chaitanya Kavuri Hills: శ్రీచైతన్య కావూరి హిల్స్‌ జోన్‌లో గ్రాండ్‌గా ఫ్రెషర్స్‌ డే వేడుకలు.. వీడియో వైరల్

విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాందించుకున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు 'ROAR- Rise of Achievers and Rockstarts 2K25' పేరుతో ఫ్రెషర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు శ్రీచైతన్య కావూరి హిల్స్‌ జోన్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదారబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మోహంతి (IPS) పాల్గొన్నారు..

Sri Chaitanya Kavuri Hills: శ్రీచైతన్య కావూరి హిల్స్‌ జోన్‌లో గ్రాండ్‌గా ఫ్రెషర్స్‌ డే వేడుకలు.. వీడియో వైరల్
Srichaitanya Kavuri Hills Zone

Updated on: Jul 21, 2025 | 5:42 PM

హైదరాబాద్‌, జులై 21: గత నలబై ఏళ్లుగా విద్యారంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాందించుకున్న శ్రీచైతన్య విద్యాసంస్థలు ‘ROAR- Rise of Achievers and Rockstarts 2K25’ పేరుతో ఫ్రెషర్స్‌ డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలు శ్రీచైతన్య కావూరి హిల్స్‌ జోన్‌లో ఘనంగా జరిగాయి. గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్ధినీ, విద్యార్ధుల్లో ఉత్తేజాన్ని, నూతన ఆశయాలను నింపింది.

ఈ కార్యక్రమానికి శ్రీచైతన్య విద్యా సంస్థల డైరెక్టర్‌ సుష్మ బొప్పన ముఖ్య అతిథిగా హాజరైనారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి విద్యార్ధి తన లక్ష్యాన్ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగాలన్నారు. శ్రీచైతన్య అందిస్తున్న ప్రపంచ స్థాయి విద్యా వేదికను మెరుగైన రిజల్ట్స్‌ కోసం సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రతి యేటా IIT-JEE, NEET వంటి జాతీయ స్థాయి పోటీల్లో శ్రీచైతన్య విద్యార్ధులు సాధిస్తున్న అఖండ విజయాలు, నాసా, ISDC వంటి అంతర్జాతీయ స్థాయిలో విజేతలుగా నిలుస్తున్న విద్యార్ధుల ప్రతిభా పాటవాలు గురించి ప్రశంసలు కురిపించారు.

ఇవి కూడా చదవండి

హైదారబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌ అవినాష్‌ మోహంతి (IPS) గెస్ట్‌ ఆఫ్‌ హానర్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. విద్యార్ధులు బాధ్యత కలిగిన పౌరులుగా మారాలని పిలుపునిచ్చారు. మాదాపూర్‌ డీసీపీ డాక్టర్‌ వినీత్‌ (IPS), జీహెచ్‌ఎమ్‌సీ కమిషనర్‌ ఆర్‌వీ కర్నన్‌ (IAS) ప్రత్యేక అతిథులుగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటుడు హైపర్‌ ఆది తనదైన శైలిలో నవ్వులు పూయించారు. ఈ వేడుక ద్వారా విద్యార్ధుల్లో భవిష్యత్‌ లక్ష్యాలపై మరింత స్పష్టత, ప్రేరణ అందించాలని నిర్వహకులు వెల్లడించారు. విద్యార్ధుల సాంస్కృతిక ప్రదర్శనలు, విజయోత్సాహాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలు ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.