హైదరాబాద్, సెప్టెంబర్ 14: జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రముఖ పబ్బులో అర్ధరాత్రి కొందరు యువకులు వీరంగం సృష్టించారు. రెండు గ్రూపులుగా విడిపోయిన యువకులు ఒకరిపై ఒకరు తీవ్రంగా దాడి చేసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్న జీరో 40 పబ్ బయట కొందరు యువకులు హల్చల్ చేశారు. రాత్రి 11 గంటల 40 నిమిషాల సమయంలో ఒకరిపై ఒకరు దాడి చేస్తున్న యువకులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపి కుమారుడు కూడా ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ మాజీ డిజిపిగా గౌతమ్ సవాంగ్ సేవలందించారు. ఆయన కుమారుడు డేవిడ్ సవాంగ్ ప్రముఖ ర్యాప్ సింగర్. నిన్న పబ్ కి వెళ్ళిన డేవిడ్ సవాంగ్ తో సిద్దార్థ్ మ్యాగ్నెన్ అనే యువకుడు గొడవకు దిగాడు.
ఈ గొడవలో డేవిడ్ సవాంగ్ తో పాటు సిద్ధార్థ్ గాయపడ్డారు. అయితే వీరి గొడవకు ఒక అమ్మాయి వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. గతంలో డేవిడ్ సవాంగ్ మాజీ గర్ల్ ఫ్రెండ్ కొన్ని విభేదాల కారణంగా అతనితో విడిపోయింది. ప్రస్తుతం యువతి సిద్ధార్థ్ కి ప్రియురాలుగా ఉంది. ఈ అమ్మాయి వ్యవహారంలోనే ఇద్దరి మధ్య కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నట్టు పోలీసుల విచారణలో బయట పడింది. పబ్ లో పాటలు పడుతూ ఉన్న సిద్ధార్థ్ ఒక్కసారిగా డేవిడ్ ను చూసి కోపడ్డాడు..దీంతో పబ్ నుండి బయటికి వస్తున్న క్రమంలో రాత్రి 11:40 గంటలకు ఒకరి పై ఒకరు దాడి చేసుకున్నారు..ఈ ఘటనలో మాజి డీజీపీ కుమారుడు డేవిడ్ మొహం పై గాయం అయ్యింది.. నిన్న రాత్రి జుబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ కు ఇచ్చిన డేవిడ్ సవాంగ్ సిద్ధార్థ్ పై ఫిర్యాదు చేశాడు
అయితే ఈ గొడవలో మొత్తం 11 మంది ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. డేవిడ్ సవాంగ్ గ్రూపులో ఐదు మంది యువకులు, సిద్ధార్థ గ్రూప్లో మరో ఆరు మంది యువకులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. 11 మందిలో ఒక అమ్మాయి సైతం ఉన్నట్లు సీసీ కెమెరాలో కనిపించింది. సిద్ధార్థ గ్రూప్ లో ముగ్గురు మార్షల్ ఫైటర్స్ ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో బయటపడింది. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా మాజీ డిజిపి కుమారుడు డేవిడ్ సవాంగ్ జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు డేవిడ్ సవాంగ్‌పై ఫిర్యాదు చేసేందుకు జూబ్లీ హిల్స్ పిఎస్‌కు సిద్ధార్థ్ మ్యాగ్నేన్ వెళ్లారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..