తింటే పోతారు.. ఖచ్చితంగా పోతారు.. ఎక్కడపడితే అక్కడ.. ఏదిపడితే అది తింటే పోవడం కన్ఫామ్.. అవును.. ప్రస్తుత పరిస్థితులు అలానే ఉన్నాయి మరి… ప్రత్యేకంగా.. హైదరాబాద్‌లో ఎక్కడ ఫుడ్ తినాలన్నా భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, బేకరీలు ఎక్కడ చూసినా.. నాణ్యత లేని ఆహారమే దర్శనమిస్తోంది. అవును.. సరిగ్గా ఇలాంటి ఓ బేకరీలోనే తాజాగా ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేశారు.. ఇదిగో.. ఇక్కడ చూస్తున్న బేకరీ పేరు AVD కారా, స్వీట్స్.. ఈ కంపెనీలో స్వీట్స్, కారాబూందీ తయారు చేస్తారు.. కాస్తో.. కూస్తో కాదు.. టన్నులు కొద్దీ తయారు చేస్తారు.. హైదరాబాద్‌లోని వేలాది షాపులకు సప్లయ్ చేస్తారు. కానీ.. నో సేఫ్టీ రూల్స్.. నో హైజెనిక్ వర్కర్స్.. నో సేఫ్టీ ప్రికాషన్స్.. పరిసరాల శుభ్రత లేదు.. తయారీలో నాణ్యత లేదు.. కల్తీ నూనెల వినియోగం.. బాత్‌రూమ్‌ల పక్కనే బూందీ, స్వీట్లు ప్యాకింగ్.. ప్యాకెట్లపై నో మాన్యుప్యాక్చరింగ్ డేట్, నో ఎక్స్‌పైరీ డేట్.. అంతా అయోమయం.. గందరగోళం. దాంతో.. AVD బేకరీ గుట్టురట్టు అయింది. అవును.. ఈ బేకరీలోని పరిస్థితులను చూస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులే కాదు.. ఎవరైనా వాక్ అనాల్సిందే.
హైదరాబాద్ ఉప్పల్ శాంతినగర్‌లోని ఏవీడీ కంపెనీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు మెరుపు దాడులు చేశారు. అక్కడి పరిస్థితులను చూసి షాక్ అయ్యారు. అపరిశుభ్రంగా ఉన్న కిచెనే కాదు.. నాసిరకమైన సరుకులతో అత్యంత దారుణంగా స్వీట్స్, కారాబూందీతోపాటు స్నాక్స్ ఐటెమ్స్ తయారు చేస్తుండడం చూసి అవాక్కయ్యారు. తయారు చేస్తున్న విధానాన్ని చూసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు కళ్లు బైర్లు కమ్మాయి. AVD కంపెనీలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు.. నాణ్యతలేని నూనెతో కారాబూందీ, స్వీట్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. దాంతో.. అమ్మకానికి సిద్ధంగా ఉన్న ఐదున్నర టన్నుల కారాబూందీ, స్వీట్స్ సీజ్ చేశారు. ఏవీడీ కంపెనీ నుంచి సిటీలో వేలాది బేకరీలు, షాపులకు, స్వీట్లు, స్నాక్స్ పంపిణీ చేస్తున్నట్లు తేల్చారు. ఇలాంటి పెద్ద కంపెనీలో అతి దారుణమైన పరిస్థితులు కనిపించడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులకు మైండ్ బ్లాంక్ అయ్యింది. ఇక.. ఎలాంటి మానుఫ్యాక్చరింగ్ డీటైల్స్ లేకుండా ఏవీడీ కంపెనీ ఫుడ్స్‌ను సప్లై చేస్తున్నట్లు తెలియడంతో.. ఆ లొకేషన్‌ను గుర్తించి తనిఖీలు చేసినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు. కంపెనీలో పనిచేస్తున్న వర్కర్స్ హైజెనిక్‌గా లేరని, సేఫ్టీ ప్రికాషన్స్ పాటించడంలేదని తెలిపారు. బాత్‌రూమ్‌ల పక్కనే ఫ్లోర్ మీద పోసి మరీ బూందీ, స్వీట్లు ప్యాకింగ్ చేస్తుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏవీడీ కంపెనీలోని ఫుడ్ శాంపుల్స్‌ను ల్యాబ్‌కు పంపిన అధికారులు.. రిపోర్టు ఆధారంగా చర్యలు తీసుకుంటామన్నారు.
మొత్తంగా.. షాపుల్లో, బేకరీల్లో దొరికే కారాబూందీ, స్వీట్స్‌ను మనం ఎన్నోసార్లు కొని తింటూ ఉంటాం.. కానీ.. ఇలాంటి పరిస్థితుల్లో తయారు చేస్తారని మాత్రం ఊహించి ఉండరు.. సో.. ఇలాంటి ఫుడ్ ఐటెమ్స్ పట్ల బీ కేర్ ఫుల్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..