Hyderabad: బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం పంపిణీ.. ఎప్పుడు..? ఎక్కడ అంటే..?

| Edited By: Subhash Goud

May 20, 2024 | 6:28 PM

ఈ సంవత్సరం మృగశిర కార్తీ జూన్ 8 శనివారం ఉదయం 11గంటకు ప్రవేశిస్తుందనీ ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కీర్తి శేషులు బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు అమర్నాథ్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులు, శివ శంకర్ గౌడ్ ,గౌరీ..

Hyderabad: బత్తిని ఫ్యామిలీ చేప ప్రసాదం పంపిణీ.. ఎప్పుడు..? ఎక్కడ అంటే..?
Fish Prasadam
Follow us on

ఈ సంవత్సరం మృగశిర కార్తీ జూన్ 8 శనివారం ఉదయం 11 గంటకు ప్రవేశిస్తుందనీ ఆ రోజునే చేప ప్రసాదం పంపిణి చేస్తామని బత్తిని గౌడ్స్ కుటుంబ సభ్యులు తెలియచేశారు. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో కీర్తి శేషులు బత్తిని హరినాథ్ గౌడ్ తనయుడు అమర్నాథ్ గౌడ్, ఇతర కుటుంబ సభ్యులు, శివ శంకర్ గౌడ్ ,గౌరీ శంకర గౌడ్, శివ శేఖర్ గౌడ్, సంతోష గౌడ్, మౌళి గౌడ్, రోషన్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమర్నాథ్ గౌడ్ మాట్లాడుతూ.. దాదాపు రెండు శతాబ్దాలుగా మా కుటుంబం ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిరా కార్తీ ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్ధాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని, అది వ్యాధి తీవ్రత ను బట్టి రోగి నాలుగు నుండి ఐదు సంవత్సరాలు తీసుకుంటే పూర్తిగా నయం అవుతోందని అన్నారు.

ఈ సేవ మా కుటుంబ పెద్దలకు నూట తొంభై సంవత్సరాల క్రితం ఓ మునీశ్వరుడు బోధించారని. అప్పటినుండి నిస్వార్ధంగా ఉచితంగా లక్షలాదిమంది శ్వాస సంబంధిత రోగులకు తరతరాలుగా ఇస్తున్నామన్నారు. ఇప్పటి వరకూ గత ప్రభుత్వాలన్నీ పూర్తి సహకారాన్ని అందిస్తూ అన్ని ప్రభుత్వ శాఖలు బాధ్యతగా ఏర్పాట్లు చేస్తూ వస్తున్నారని అమర్నాథ గౌడ్ అన్నారు.

ఈ సంవత్సరం కూడా నూతనంగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వ మాన్య ముఖ్యమంత్రి, సంబధిత ఇతర మంత్రులను అనుమతికి ఏర్పాట్లను చేయవలసిందిగా కోరామన్నారు. ఈ చేప ప్రసాదం పంపిణీకి ఎప్పటిలాగనే ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ, వాటర్ వర్క్స్, మునిసిపాలిటీ, పోలీసులతో పాటు మత్య్స శాఖా కావాల్సిన చేపల్ని సిద్ధం చేయాల్సిందిగా లిఖిత పూర్వకంగా కోరామన్నారు.

దేశ, విదేశాల నుండి వచ్చే లక్షలాది మంది రోగులకు ఎవ్వరీకీ అసౌకర్యం కలుగకుండా పంపిణి సజావుగా సాగడానికి అగ్రవాల్ సేవా దళ్ స్వచ్ఛంద సంస్థ రోగులకు భోజనం, కాఫీ, టీలు, టిఫిన్ మజ్జిగ, మంచినీరు అందిస్తున్నారు. అత్యవసర వైద్య సదుపాయంతో పాటు క్యూ లైన్‌లో ఉన్న రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వాటీర్లు సేవలందిస్తున్నారు.

ముఖ్యంగా మాకు బద్రీ విశాలాల్ పన్నాలాల్ పిట్టి చైర్మన్ శరత్ పిట్టి ఈ చేప ప్రసాదం పంపిణి కోసం అవసరమైన పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని, జూన్ 8 ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 11 గంటల వరకూ నాంపల్లి ఎగ్జిబిషన్స్ గ్రౌండ్‌లో నిర్వహించే చేప ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అగ్రవాల్ సేవాదళ్ కన్వీనర్ అజిత గుప్తా, కైలాష్ కేడియా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి