Hyderabad: కూతురి మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య.. స్నేహితులకు మెసేజ్‌..!

| Edited By: Jyothi Gadda

Aug 28, 2023 | 4:00 PM

Hyderabad: తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తండ్రి, కూతురు మృతదేహాలు ఒకే చోట చూసిన స్థానికులు, బంధువుల హృదయాలు కలిచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

Hyderabad: కూతురి మరణం తట్టుకోలేక తండ్రి ఆత్మహత్య.. స్నేహితులకు మెసేజ్‌..!
Death
Follow us on

కన్న కూతురు మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన హైదరాబాద్‌ నగరం ఖైరతాబాద్‌లో చోటుచేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు మృతి చెందటంతో ఆ తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. గోరు ముద్దలు తినిపిస్తూ గుండెల మీద పెట్టుకొని ఎంతో గారాభంగా పెంచిన కూతురికి అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ తండ్రి గుండె ముక్కలైంది. కన్నకూతురు లేని ఈ లోకంలో తాను కూడా బతకలేనని నిర్ణయించుకున్నాడు. కూతురు లేదన్న మనస్తాపంతో ఆ తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఖైరతాబాద్ ఏరియా లో నివాసం ఉండే కిషోర్ పెద్ద కూతురు 4 ఏళ్ళ ఆరాధ్య లంగ్స్ సమస్యతో బాధపడుతోంది. కూతురు అనారోగ్య విషయం భార్య ప్రియాంక కి చెప్పకుండా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాడు కిషోర్. అయితే గత కొద్ది రోజులుగా కూతురు ఆరాధ్య ఆరోగ్య పరిస్థితి విషమించింది. భార్యకు చెబితే తట్టుకోలేదని ఆ బాధను తనలోనే ఒంటరిగా అనుభవిస్తూ ట్రీట్మెంట్ ఇప్పిస్తుండగా నిన్న ఆరాధ్య మృతి చెందింది..కూతురు ఆరాధ్య ఇక లేదు అని వార్త జీర్ణించుకోలేక తను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను అంటూ మెసేజ్ చేసి తండ్రి కిషోర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తాను రైలు కింద పడి ఆత్మ హత్య చేసుకుంటున్నా అంటూ.. తన ఫ్రెండ్స్ కి మెసేజ్ పెట్టి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసాడు కిషోర్.

తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కిశోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తండ్రి, కూతురు మృతదేహాలు ఒకే చోట చూసిన స్థానికులు, బంధువుల హృదయాలు కలిచివేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..