Hyderabad: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన హైదరాబాద్‌ శివారు ఫామ్‌హౌస్‌లు.. ఇంత జరుగుతుందా?

Hyderabad Farmhouses: ఫామ్‌హౌస్‌కి ఒకప్పుడు రిఫ్రెష్‌మెంట్‌ కోసం వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు దాని ఆర్థమే మార్చేశారు. అసాంఘీక కార్యకలాపాలకు ఫామ్‌హౌస్‌లు అడ్రస్‌గా మారిపోయాయి. అయితే పోలీసులు మాత్రం ఇకపై ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చర్యలు తప్పవంటున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌లతో తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు..

Hyderabad: అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన హైదరాబాద్‌ శివారు ఫామ్‌హౌస్‌లు.. ఇంత జరుగుతుందా?

Edited By:

Updated on: Feb 17, 2025 | 3:43 PM

హైదరాబాద్‌ శివారు ఫామ్‌హౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయి. ఓ చోట లిక్కర్ అండ్ రేవ్ పార్టీ.. ఇంకోచోట కిడ్నాప్, మర్డర్‌.. మరోచోట కోళ్ల పందాలు, క్యాసినోలు.. ఇంత యథేచ్ఛగా ఎలా జరుగుతున్నాయి? పోలీసుల కళ్లుగప్పి మస్తు మస్తు పార్టీల కండక్ట్ చేస్తున్నదెవరు? మొయినాబాద్‌ ఫామ్‌ హౌస్‌.. ఎమ్మెల్యేల కొనుగోలుకి కేరాఫ్ అడ్రస్‌గా మారింది. అప్పట్లో ఈ ఎపిసోడ్ పొలిటికల్‌గా ప్రకంపనలు రేపింది. ఆ తర్వాత ఓ సినిమా హీరో ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ పెద్ద దుమారమే రేపింది. మరో ఫామ్‌హౌస్‌లో కిడ్నాప్ అండ్ మర్డర్‌ ఖాకీలను సైతం షాకయ్యేలా చేసింది. లేటెస్ట్‌గా ఓ ఫామ్‌హౌస్‌లో కోడిపందాలు, క్యాసినోల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నేరం ఏదైనా ఫామ్‌హౌస్‌ మాటునే జరుగుతోంది.

హైదరాబాద్‌ శివారులో వెయ్యికి పైగా ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. ఎక్కువగా మొయినాబాద్‌, షామీర్‌పేట్ పరిసరాల్లో ఉన్నాయి. ప్రధానంగా మొయినాబాద్‌లో విలాసవంతమైన ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. వీటిలోకి ఎవరెవరు వస్తున్నారు? ఏం చేస్తున్నారో ఎవ్వరికీ తెలియదు. గొడవలు జరిగినా.. భారీ శబ్దాలు వినబడినా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేస్తుంటారు. అప్పుడు మాత్రమే అందులో జరిగే తతంగం వెలుగులోకి వస్తుంది.

ఫామ్‌హౌస్‌లో విందు, చిందు, కనువిందు కామన్‌. ఈ వ్యవహారంలో సూత్రధారులు వేరే పాత్రధారులు వేరే. ఓనర్ల దగ్గర లీజ్‌ తీసుకుని గలీజ్‌ పనులు చేస్తున్నారు. అందులో ఏం జరుగుతుందో బహ్య ప్రపంచానికి తెలిసే దాకా ఫామ్‌హౌస్‌ ఓనర్లు తెలియడం లేదు. అలాగని తమకు సంబంధం లేదంటే కుదరంటున్నారు పోలీసులు.

ఫామ్‌హౌస్‌కి ఒకప్పుడు రిఫ్రెష్‌మెంట్‌ కోసం వెళ్లేవాళ్లు. కానీ ఇప్పుడు దాని ఆర్థమే మార్చేశారు. అసాంఘీక కార్యకలాపాలకు ఫామ్‌హౌస్‌లు అడ్రస్‌గా మారిపోయాయి. అయితే పోలీసులు మాత్రం ఇకపై ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే చర్యలు తప్పవంటున్నారు. స్పెషల్‌ డ్రైవ్‌లతో తాట తీస్తామని హెచ్చరిస్తున్నారు.

ఫామ్‌హౌస్ మాటున లిక్కర్‌, రేవ్‌ పార్టీలు జరుగుతున్నాయి. ఇప్పుడు అంతకుమించి అనేలా కోడి పందాలు నిర్వహించే స్థాయికి ఎదిగారు నిర్వాహాకులు. ఏదైనా ఇన్సిడెంట్‌ జరిగితే కొద్ది రోజులు ఫామ్‌హౌస్‌లకు దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత షరా మామూలుగానే ఫామ్‌హౌస్‌లలో అదే తంతు నిర్వహిస్తున్నారు. పోలీసులు మాత్రం ఇకపై కఠినంగా వ్యవహరిస్తామంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి