నకిలీ ‘ఐపీఎస్’ గుట్టురట్టు

|

May 16, 2019 | 7:22 PM

తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. తండ్రిలాగే తానూ పోలీస్ యూనిఫార్మ్ వేసుకోవాలని కలలు కన్నాడు. సివిల్స్ కోచింగ్ తీసుకొని ఎన్నోసార్లు పరీక్షరాశాడు. సక్సెస్ కాకపోవడంతో అడ్డదార్లు తొక్కాడు. నకిలీ ఐపీఎస్ అధికారిగా మారి ఎన్నో అక్రమ దందాలకు తెరతీశాడు. తాజాగా హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ అధికారి గుట్టురట్టయింది. ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఎన్ఐఏ, రైల్వే అధికారి పేరుతో జనాలను మోసంచేస్తున్న కేటుగాడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కినెట్టారు. వివరాల్లోకి వెళ్తే..ప్రకాశం  జిల్లా గిద్దలూరుకు చెందిన […]

నకిలీ ఐపీఎస్ గుట్టురట్టు
Follow us on

తండ్రి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్. తండ్రిలాగే తానూ పోలీస్ యూనిఫార్మ్ వేసుకోవాలని కలలు కన్నాడు. సివిల్స్ కోచింగ్ తీసుకొని ఎన్నోసార్లు పరీక్షరాశాడు. సక్సెస్ కాకపోవడంతో అడ్డదార్లు తొక్కాడు. నకిలీ ఐపీఎస్ అధికారిగా మారి ఎన్నో అక్రమ దందాలకు తెరతీశాడు. తాజాగా హైదరాబాద్‌లో నకిలీ ఐపీఎస్ అధికారి గుట్టురట్టయింది. ఎయిర్‌ఫోర్స్, నేవీ, ఆర్మీ, ఎన్ఐఏ, రైల్వే అధికారి పేరుతో జనాలను మోసంచేస్తున్న కేటుగాడిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసి కటకటాల వెనక్కినెట్టారు.

వివరాల్లోకి వెళ్తే..ప్రకాశం  జిల్లా గిద్దలూరుకు చెందిన గురువినోద్ కుమార్ రెడ్డి హైదరాబాద్‌లోన ప్రముఖ సివిల్స్ ఇన్‌స్టిట్యూట్‌లో కోచింగ్ తీసుకున్నాడు. కొన్నేళ్లుగా సివిల్స్‌కు సన్నద్ధమవుతున్నాడు. ఐతే ఎన్నిసార్లు ప్రరీక్ష రాసినా విజయవంతం కాకపోవడంతో గురువినోద్ పక్కదారిపట్టాడు. తన పరువు పోతుందన్న భావనతో స్నేహితులు, బంధువులను నమ్మించేందుకు నకిలీ ఐపీఎస్ అవతారమొత్తాడు. మొదట ఎయిర్‌ఫోర్స్ ఫ్లైయింగ్ ఆఫీసర్‌గా చెలమాణి కావడంతో గిద్దలూరు పోలీస్ స్టేషన్‌లో అతడిపై కేసు నమోదై జైలుకు కూడా వెళ్లాడు.

2019లో జైలు నుంచి బయటకొచ్చిన గురువినోద్‌లో ఎటువంటి మార్పు రాలేదు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ సివిల్స్ కోచింగ్‌సెంటర్‌లో ఫ్యాకల్టీగా పనిచేస్తున్న రిటైర్డ్ ఆర్మీ మేజర్‌తో అతడు పరిచయం పెంచుకున్నాడు. రబ్బర్ స్టాంప్‌లు, ఐడీ కార్డులు సృష్టించి తాను ఎన్‌ఐఏ అడిషనల్ ఎస్పీనని చెప్పుకొని తిరిగాడు. ఈ క్రమంలో రిటైర్డ్ ఆర్మీ మేజర్‌ ఇంట్లో పిస్టల్ మాయమైంది. దీనిపై పోలీసులకు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు. ఐతే ఆ చోరీ వెనక గురువినోదే ఉన్నట్లు తేలింది. అతడు ఎన్‌ఐఏ ఆఫీసర్ కాదని NIA స్పష్టచేయడంతో పోలీసులు అరెస్ట్‌చేసి విచారిస్తున్నారు. అతని వద్ద నుంచి ఆర్మీ దుస్తులు, బూట్లు, రబ్బర్ స్టాంపులు, ఐడీ కార్డు స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.