Hyderabad: నోరూరించే ఐస్‌క్రీమ్‌లు ఇష్టంగా తింటున్నారా.. బీ కేర్‌ఫుల్‌.!

| Edited By: Narender Vaitla

May 05, 2023 | 1:51 PM

హైదరాబాద్‌లో మరోసారి కల్తీ ఐస్‌క్రీమ్‌లు తీవ్ర కల్లోలం సృష్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా నాసిరకంగా ఐస్‌క్రీమ్ తయారు చేసే ఫ్యాక్టరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి..

Hyderabad: నోరూరించే ఐస్‌క్రీమ్‌లు ఇష్టంగా తింటున్నారా.. బీ కేర్‌ఫుల్‌.!
Representative Image
Follow us on

హైదరాబాద్‌లో మరోసారి కల్తీ ఐస్‌క్రీమ్‌లు తీవ్ర కల్లోలం సృష్టిస్తున్నాయి. ఎక్కడ చూసినా నాసిరకంగా ఐస్‌క్రీమ్ తయారు చేసే ఫ్యాక్టరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. తాజాగా జీడిమెట్లలో కల్తీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తోన్న ముఠాను గుట్టు రట్టు చేశారు పోలీసులు.

జీడిమెట్లలోని షాపూర్‌లో తయారవుతున్న కల్తీ ఐస్‌క్రీమ్‌ల కేంద్రంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాణాంతక కెమికల్స్‌తో ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తున్నట్లు ఈ తనిఖీల్లో గుర్తించారు. నిర్వాహకుడు ఫిరోజ్‌ను అరెస్ట్ చేయడంతో పాటు సుమారు రూ. 15 లక్షలు విలువ చేసే సామాగ్రిని పోలీసులు సీజ్ చేశారు.

కాగా, ఈ మధ్యకాలంలో హైదరాబాద్ కేంద్రం కల్తీ ఐస్‌క్రీమ్‌లు తయారు చేస్తోన్న కేంద్రాలపై పోలీసులు వరుసగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈగలు, దోమలు స్వైరవిహారం చేస్తున్న అపరిశుభ్ర వాతావరణంలో, మురుగు నీటి పక్కనే రసాయనాలు, రంగుల నీరుతో ఐస్‌క్రీమ్‌ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. చిన్న పిల్లల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ ఐస్ క్రీమ్స్ తయారు చేస్తున్న అలాంటి పరిశ్రమలపై పలు కేసులు నమోదు చేసి.. వాటిని మూసివేశారు పోలీసులు. రసాయనాలతో తయారైన ఇలాంటి ఐస్ క్రీమ్‌లు తింటే ఆరోగ్యానికి ప్రమాదం అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఐస్‌క్రీమ్‌లు తినే ముందు ఒకట్రెండు సార్లు ఆలోచించాలని, బీ కేర్‌ఫుల్ అంటూ అధికారులు సూచిస్తున్నారు.