Hyderabad: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ.. రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతే ఫిర్యాదు..

|

Aug 27, 2022 | 8:15 PM

తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ మొదలైంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అప్పుడెప్పుడో చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయి. సొంత పార్టీ నేతే అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుక అసలు కారణమేంటి?

Hyderabad: తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త పంచాయతీ..  రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతే ఫిర్యాదు..
Revanth Reddy
Follow us on

Telangana: జూబ్లీహిల్స్‌ రేప్ కేసుపై గతంలో రేవంత్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్.. పెద్దమ్మ గుడి(Peddamma Thalli temple) ఆవరణలో రేప్ జరిగిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి( Revanth Reddy) ఆరోపించారు. దీనిపై బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.  ఈ వ్యాఖ్యలను ఆలయ అధికారులు తప్పుబట్టారు. భక్తుల మనోభావాలతో పాటు ఆలయ ప్రతిష్టను దెబ్బతీసేలా రేవంత్ మాట్లాడుతున్నారంటూ ఆలయ కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ PJR కుమారుడు విష్ణు.. జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడే.. అయినప్పటికీ సొంత పార్టీ అధ్యక్షుడిపై కేసు పెట్టడం పొలిటికల్‌గా హీట్ పుట్టిస్తోంది. పెద్దమ్మ తల్లి గుడిపై కామెంట్లు చేసేటప్పుడు తనను కనీసం సంప్రదించలేదన్నారు పీజేఆర్ తనయుడు విష్ణు. పైగా గుడి దగ్గర రేప్ జరగలేదని.. సీపీ క్లారిటీ ఇచ్చినా రేవంత్‌ బద్నాం చేస్తున్నారు. అందుకే పరువు నష్టం దావా వేశామంటోంది ఆలయ కమిటీ.  గతంలోనూ రేవంత్ రెడ్డి ఇదే తరహాలో రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. కానీ అప్పుడు స్పందించని టెంపుల్ కమిటీ ఇప్పుడు ఏకంగా ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..