Hyderabad Rains: హైదరాబాదీలను భయపెడుతోన్న మూసీ ప్రవాహం.. హైఅలర్ట్ చేసిన అధికారులు..

|

Jul 27, 2022 | 12:31 PM

Hyderabad Rains: తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతోన్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది...

Hyderabad Rains: హైదరాబాదీలను భయపెడుతోన్న మూసీ ప్రవాహం.. హైఅలర్ట్ చేసిన అధికారులు..
Follow us on

Hyderabad Rains: తెలంగాణ వ్యాప్తంగా దంచికొడుతోన్న వర్షాలతో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు వరద ప్రవాహం విపరీతంగా పెరిగింది. నగరంలో పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు హుస్సేన్ సాగర్‌కు వరద ప్రవాహం పెరిగింది. దీంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా తూముల ద్వారా మూసీలోకి వదులుతున్నారు అధికారులు. రానున్న రెండు రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హుస్సేన్ సాగర్ దిగున నివాసమంటున్న వారు, మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉంటున్న వారిని అధికారులు హైఅలర్ట్ చేశారు. యుద్ధ ప్రాతిపదికన షెల్టర్లు, అన్నవసతి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఇక నగరంలోని జంట జలాశయాలైన గండిపేట్‌, హిమాయత్‌ సాగర్‌కు వరద పోటెత్తింది. పరిగి, వికారాబాద్‌, చేవెళ్లలో భారీ వర్షాలతో రిజర్వాయర్లకు భారీగా వరద వచ్చి చేరుతోంది. గండిపేట్ 12 గేట్లు, హిమాయత్‌సాగర్ 8 గేట్లు తెరిచారు.ఈ రెండు జలాశయాల నుంచి 12వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటికే మూసీలో ప్రవాహం పెరగగా తాజాగా జంట జలాశయాల నుంచి వస్తోన్న నీరుతో మూసీ ఓ రేంజ్‌లో ప్రవహిస్తోంది. దీంతో నగర ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కొన్ని చోట్ల బ్రిడ్జిల పై నుంచి నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు అటుగా వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..