Hyderabad: కాచిగూడ రైల్వే ట్రాక్‌పై కారు కలకలం..

కాచిగూడలో రైల్వే ట్రాక్‌పై గుర్తు తెలియని వ్యక్తి కారు నిలిపేయడంతో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి, కారును ట్రాక్‌పై నుంచి తొలగించి బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు చేపట్టారు. అయితే విచారించగా ఆ కారును అక్కడ ఎవరు పెట్టారో తేలింది.

Hyderabad: కాచిగూడ రైల్వే ట్రాక్‌పై కారు కలకలం..
Car

Updated on: Nov 13, 2025 | 8:30 PM

కాచిగూడలో రైల్వే ట్రాక్‌కు అడ్డంగా గుర్తు తెలియని వ్యక్తి కారు నిలపడంతో కలకలం చెలరేగింది. సమాచారం రావడంతో వెంటనే అలెర్టైన పోలీసులు..  కారును ట్రాక్‌పై నుంచి తీసి.. బాంబ్ అండ్ డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు.  రైల్వే ట్రాక్ సమీపంలో పోలీసులు ఆంక్షలు విధించారు. బాలాజీ అనే వ్యక్తి పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు గుర్తించారు. కాగా ఆ కారును బుధవారం యజమాని రెంట్‌కు ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఒక వ్యక్తి మద్యం అతిగా సేవించి.. కారు అక్కడ పార్క్ చేసి వెళ్లినట్లు పోలీసులు తేల్చారు. కారు ఓనర్‌ను పిలిపించి.. దాన్ని అక్కడి నుంచి తీసివేశారు.