Hyderabad: ఒరేయ్.. ఇలా ఉన్నావ్ ఏంట్రా… డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయబోతే

| Edited By: Ram Naramaneni

Jun 29, 2024 | 2:56 PM

హైదరాబాద్ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీల్లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఓ వాహనదారుడు పోలీసు నుంచి బ్రీత్‌ ఎనలైజర్‌ను లాక్కుని పరారయ్యాడు. అతన్ని పట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి. ప్రస్తుతం పోలీస్ శాఖలో ఈ ఘటన చర్చనీయాంశమైంది.

Hyderabad: ఒరేయ్.. ఇలా ఉన్నావ్ ఏంట్రా... డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయబోతే
Drunk And Drive Test (Representative image)
Follow us on

డ్రంక్ డ్రైవ్ విషయంలో హైదరాబాద్ పోలీసులు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. వారాంతాల్లో మాత్రమే కాకుండా మామూలు రోజుల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఐతే గాలి ఉదమంటే.. కథలు పడుతూ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన మందుబాబులను ఇప్పటివరకు చూశాం. కానీ తాజాగా నిర్వహించిన డంక్రెన్ డ్రైవ్ లో షాకింగ్ పరిణామం ఒకటి చోటు చేసుకుంది. లిక్కర్ సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తుల మద్యం లెక్కను తేల్చేందుకు బ్రీత్ ఎనలైజర్ ట్రాఫిక్ పోలీసులు ఉపయోగిస్తారన్న విషయం తెలిసిందే. మందుబాబుల నోటివద్ద బ్రీత్ ఎనలైజర్ పెట్టి.. గాలి ఊదమనటం.. అందులో వచ్చే స్కోర్ ఆధారంగా ఎంత తాగిందన్న విషయాన్ని నిర్ధారిస్తారు. ఇటీవల డ్రంకెన్ డ్రైవ్ వేళ.. ఒక మందుబాబు పోలీసులు తన నోటివద్ద పెట్టిన బ్రీత్ ఎనలైజర్ ను తీసుకొని ఎస్కేప్ అయ్యాడు.

దీంతో.. తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఒక్కసారిగా కంగుతిన్నారు. బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 27న రాత్రి సమయంలో ట్రాఫిక్ పోలీసులు పుల్లారెడ్డి బంగ్లా దాటిన తర్వాత వచ్చే చౌరస్తాలో డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు. ఆ సమయంలో వర్షం పడుతోంది. దీంతో.. అటుగా వచ్చిన ఒక కారు నడుపుతున్న డ్రైవర్ కు టెస్ట్ చేయగా.. అతడు లిక్కర్ తాగలేదని వెల్లడైంది. వెనుకగా వచ్చిన మరో కారును పోలీసులు ఆపారు. కారును బారికేడ్ల అవతలకు తీసుకెళ్లిన కానిస్టేబుల్ డ్రైవింగ్ సీటులో ఉన్న వ్యక్తిని పరీక్ష చేసేందుకు బ్రీత్ ఎనలైజర్ ను అతడి నోటి వద్ద ఉంచాడు. అతను గాలి ఊదినట్లే యాక్ట్ చేసి.. కానిస్టేబుల్ చేతిలో ఉన్న బ్రీత్ ఎనలైజర్ ను లాక్కుని ఎస్కేప్ అయ్యాడు. కంగుతిన్న పోలీసులు ఆ కారును వెంబడించినా ఉపయోగం లేకపోయింది. బాగా వర్షం కురుస్తుండటం.. అర్థరాత్రి వేళ రోడ్లు ఖాళీగా ఉండటంతో అతను వేగంగా వెళ్ళిపోయాడు. సదరు కారు నెంబరును గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..