Hyderabad: మద్యం తాగి రొడ్డుపై రచ్చ చేసిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు

| Edited By: Subhash Goud

Nov 04, 2024 | 5:37 PM

Hyderabad: హైదరాబాద్‌లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కొందరు మద్యం తాగి వాహనాలు నడుపుతూ నడి రోడ్డుపై ట్రాఫిక్‌ పోలీసులతో వాదనకు దిగుతున్నాయి. తాగిన సోయిలో ఏం చేస్తున్నారో కూడా తెలియక ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు..

Hyderabad: మద్యం తాగి రొడ్డుపై రచ్చ చేసిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు.. అరెస్ట్‌ చేసిన పోలీసులు
Follow us on

హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతున్నారా అని ఆరా తీసేందుకు చేసిన డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్ తీసుకోవడానికి నిరాకరించిన ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం తెల్లవారుజామున బంజారా హిల్స్‌లో రోడ్ నంబర్ 2 వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. పీ సిద్ధార్థ్, అతని స్నేహితుడు పి శేషసాయి ప్రసాద్ వాహన తనిఖీల్లో చిక్కారు. వీరు ఇద్దరూ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులను దుర్వినియోగం చేసి, రోడ్డు మీద రచ్చ చేశారు.

శనివారం రాత్రి 1.30 గంటల సమయంలో బంజారా హిల్స్ ట్రాఫిక్ పోలీసులు రోడ్ నంబర్ 2 వద్ద డ్రంక్ డ్రైవింగ్ తనిఖీలు చేస్తున్నారు. ఒక కారులో నలుగురు వ్యక్తులు ఉన్నారు. 200 మీటర్ల దూరంలో ఉన్న తనిఖీ పాయింట్‌ వద్దకు రాకముందే వాహనాన్ని నిలిపివేశారు. ఆ కారులో ఓ మహిళ కూడా ఉంది. అప్పుడు అక్కడ విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకు అనుమానం వచ్చి వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. తరువాత, కారు పాయింట్ వద్దకు రాగానే, ట్రాఫిక్ పోలీసులు సిద్ధార్థ్‌కు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్ష చేసేందుకు ప్రయత్నించగా, సిద్ధార్థ్ మాత్రం తాను వాహనం నడపలేదని, అతని స్నేహితుడు ప్రసాద్ ముందుకొచ్చి పోలీసులతో వాదనకు దిగాడు.

స్ధానిక ట్రాఫిక్ పోలీసులు బంజారాహిల్స్‌ పోలీసులకు సమాచారం అందించడంతో ఇద్దరిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. గచ్చిబౌలి లోని ఒక పబ్‌లో మద్యం సేవించి తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడుతున్న సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్లపై వారి సంస్థలకు అప్పట్లో పోలీసులు లేఖలు కూడా రాశారు. ఈ సంఘటనలో మరొకసారి మద్యం సేవించి వాహనం నడపాలంటే భయపడేలా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా సంస్థ యాజమాన్యానికి పోలీసులు లేఖలు రాశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి