Drunken Driving: ఫుల్లుగా మందుకొట్టి కారు డ్రైవ్ చేస్తూ.. మేడ్చల్‌లో మందుబాబు అరాచకం

ఎంత చెప్పినా మందుబాబులు మాట వినట్లేదు, తాగి మత్తు వదలకుండానే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు..

Drunken Driving: ఫుల్లుగా మందుకొట్టి కారు డ్రైవ్ చేస్తూ.. మేడ్చల్‌లో మందుబాబు అరాచకం
Accident

Updated on: Jul 16, 2021 | 6:45 AM

Drunk car driver rams lorry: ఎంత చెప్పినా మందుబాబులు మాట వినట్లేదు, తాగి మత్తు వదలకుండానే ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాదు, ఎదుటివాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. గురువారం రాత్రి మేడ్చెల్ లోని కండ్లకోయ చౌరస్తాలో ఫుల్లుగా మద్యం తాగిన ఓ వ్యక్తి హుండాయ్ కార్ తో లారీకి అడ్డంగా వెళ్లి ఆక్సిడెంట్ చేశాడు. అదృష్టవశాత్తు లారీ మినిమం స్పీడ్ లో ఉండటంతోపాటు, లారీ డ్రైవర్ అత్యంత చాకచక్యంగా వ్యవహరించడంతో బతికి బయటపడ్డాడు.

అదే సమయంలో లారీకి కూడా పెద్ద ప్రమాదమే తప్పింది. ఒక వేళ లారీ హైవే స్పీడులో ప్రయాణిస్తున్నట్టయితే, కారు తోపాటు మందుబాబు కూడా నుజ్జు నుజ్జు అయ్యేవాడు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, తప్పు తనది పెట్టుకుని మద్యం మత్తులో లారీ డ్రైవర్ ని కొట్టే ప్రయత్నం చేశాడు డ్రంక్ అండ్ డ్రైవర్. అసలు తాను ఏ హోష్ లో ఉన్నాడో కూడా అర్థం కాని పరిస్థితిలో ఆ ప్రాంతంలో ఒక బీభత్సమే సృష్టించాడు.

పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కార్ డ్రైవర్ కి బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయడానికి ప్రయత్నించగా మందుబాబు ససేమిరా అన్నాడు.. కుదరదంటే కుదరదంటూ నిరాకరించాడు. పోలీసులతోనూ తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దీంతో మందుబాబుని పోలీస్ స్టేషన్ కి తరలించి బ్లడ్ శాంపిల్స్ టెస్ట్ చేసి ఆల్కహాల్ శాతం గుర్తించారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Read also: Kathi Mahesh: సినీ నటుడు కత్తి మహేష్ మృతిలో కొత్త ట్విస్ట్.. డ్రైవర్‌ను విచారించిన పోలీసులు