పోలీసులకూ.. డ్రంకన్ డ్రైవ్ రూల్..!

| Edited By: Srinu

Jul 02, 2019 | 5:32 PM

డ్రంకన్ డ్రైవ్ గురించి అందరికీ తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మిక్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా పోలీసులు చెకింగ్స్ చేస్తూంటారు. వాటిలో పట్టుబడ్డవారికి చలానా వేసి కౌన్సిలింగ్‌కు పంపిస్తూంటారు. ఇక ఇదే విధానం విధులకు హాజరయ్యే పోలీసులకూ వర్తిస్తుందని హైదరాబాద్, రాచకొండ పోలీస్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజుకు రెండు సార్లు బ్రీతింగ్ ఎనలైజర్‌ ఊదాలని ప్రత్యేక నియమం పెట్టారు. ఉదయం విధులకు హాజరయ్యే ముందు.. ఆపై డ్యూటీ నుంచి వెళ్లిపోయే ముందు ఊదాల్సివుంటుంది. […]

పోలీసులకూ.. డ్రంకన్ డ్రైవ్ రూల్..!
Follow us on

డ్రంకన్ డ్రైవ్ గురించి అందరికీ తెలిసిందే. డ్రంక్ అండ్ డ్రైవింగ్ మిక్స్ చేసి ప్రాణాల మీదకు తెచ్చుకోకుండా పోలీసులు చెకింగ్స్ చేస్తూంటారు. వాటిలో పట్టుబడ్డవారికి చలానా వేసి కౌన్సిలింగ్‌కు పంపిస్తూంటారు. ఇక ఇదే విధానం విధులకు హాజరయ్యే పోలీసులకూ వర్తిస్తుందని హైదరాబాద్, రాచకొండ పోలీస్ బాస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రోజుకు రెండు సార్లు బ్రీతింగ్ ఎనలైజర్‌ ఊదాలని ప్రత్యేక నియమం పెట్టారు. ఉదయం విధులకు హాజరయ్యే ముందు.. ఆపై డ్యూటీ నుంచి వెళ్లిపోయే ముందు ఊదాల్సివుంటుంది. ఇటీవల.. డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తోన్న సమయంలో, అలాగే.. పోలీసులు డ్రింక్ చేసి విధులు నిర్వహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.