Hyderabad: ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా ప్యాసింజర్.. అతని బ్యాగ్ తనిఖీ చేయగా.. షాక్

|

Jun 29, 2024 | 4:59 PM

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు DRI అధికారులు. రూ.67లక్షల విలువైన అమెరికన్ డాలర్స్ సీజ్ చేశారు. ఓ ప్రయాణీకుడి ప్రవర్తనపై అనుమానం రావడంతో.. అతడిని పలు వివరాలు అడిగారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో లగేజ్ చేశారు.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్స్‌లో పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు.  రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం  నుంచి దుబాయ్‌కు వెళ్లేందుకు ఒక ప్రయాణీకుడు ఎయిర్‌పోర్ట్‌కు వచ్చాడు. తనిఖీలు చేస్తుండగా.. అతని ప్రవర్తనపై అధికారులకు అనుమానం కలిగింది. ఆరా తీయగా కంగారు పడుతూ పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో అతని ట్రాలీ బ్యాగ్ చెక్ చేయగా.. లోపల రూ. 67.11 లక్షలు విలువైన అమెరికన్ డాలర్స్‌ను అధికారులు గుర్తించారు.  కరెన్సీని ట్రాలీ బ్యాగ్ లోపల ప్లాస్టిక్ సపోర్ట్ షీట్‌ల కింద తెలివిగా దాచి ఉంచినట్లు అధికారులు కనుగొన్నారు. విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, కస్టమ్స్ చట్టం-1962 నిబంధనల ప్రకారం ప్రయాణికుడిని అరెస్టు చేసి, జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. దీని వెనుక ఉన్న నెట్‌వర్క్‌ను గుర్తించేందుకు తదుపని ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..