తస్మాత్ జాగ్రత్త.. ఇంట్లో నల్లా నీళ్లు పట్టేటప్పుడు ఇలా చేస్తే జైలుకే.! పూర్తి వివరాలు..

| Edited By: Ravi Kiran

Feb 28, 2024 | 4:09 PM

జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగరానికి జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు..

తస్మాత్ జాగ్రత్త.. ఇంట్లో నల్లా నీళ్లు పట్టేటప్పుడు ఇలా చేస్తే జైలుకే.! పూర్తి వివరాలు..
Water Taps Ghmc
Follow us on

హైదరాబాద్, ఫిబ్రవరి 28: జీహెచ్ఎంసీతో పాటు ఔటర్ రింగు రోడ్డు వరకు విస్తరించిన హైదరాబాద్ మహా నగరానికి జలమండలి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి పైపు లైన్ల ద్వారా తాగునీరు సరఫరా చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వినియోగదారులు తమ నల్లాలకు మోటార్లు బిగించుకోవడం జలమండలి అధికారుల దృష్టికి వచ్చింది. దీని వల్ల మిగిలిన వినియోగదారులకు.. లో- ప్రెజర్‌తో నీటి సరఫరా జరుగుతోంది. ఇలా చేయడం చట్టరీత్యా నేరం.

ఈ నేపథ్యంలో జలమండలి విజిలెన్స్ అధికారులు క్రమంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎవరైనా వినియోగదారులు ఇలా తమ నల్లాలకు మోటార్లు బిగించి పట్టుబడితే.. వారిపై జలమండలి నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటు మోటార్లు సీజ్ చేస్తారు. కాబట్టి వినియోగదారులెవరూ నల్లాకు మోటార్లు బిగించవద్దని జలమండలి విజ్ఞప్తి చేస్తోంది. ఒకవేళ తక్కువ ప్రెజర్‌తో నీరు సరఫరా అయినా.. లేదా నీటి సరఫరాలో ఏవైనా ఇతర సమస్యలు తలెత్తినా.. తమకు దగ్గర్లోని సంబంధిత మేనేజర్, డీజీఎం, జీఎం అధికారులను సంప్రదించాలి. లేదా జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. వాటిపై తప్పకుండా తగిన చర్యలు తీసుకుని సమస్యల్ని పరిష్కరిస్తారు.

ఇది చదవండి: రూ. 500కే గ్యాస్ సిలిండర్.. తొలుత పూర్తి ధర చెల్లించాల్సిందే.. పూర్తి వివరాలు..