Hyderabad Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పై పోలీసుల కీలక నిర్ణయం..

నేడు డిజిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డి, అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, ఐజీ తరుణ్ జోషి పాల్గొన్నారు.

Hyderabad Traffic Police: హైదరాబాద్ ట్రాఫిక్ పై పోలీసుల కీలక నిర్ణయం..
Hyderabad Traffic Police

Edited By:

Updated on: Jan 16, 2024 | 8:25 PM

జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్‌పై సీనియర్ పోలీస్ అధికారులతో డీజీపీ రవి గుప్తా సమీక్షించారు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జిహెచ్‌ఎంసి) పరిధిలోని ట్రాఫిక్ పరిస్థితిపై తెలంగాణ డిజిపి రవిగుప్తా మంగళవారం నాడు సీనియర్ పోలీసు అధికారులతో సమీక్ష జరిపారు.. నేడు డిజిపి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇంటెలిజెన్స్ చీఫ్ బి శివధర్ రెడ్డి, అదనపు డీజీపీ సంజయ్ కుమార్ జైన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి, రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు, హైదరాబాద్ అదనపు కమిషనర్ విక్రమ్ సింగ్ మాన్, హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ విశ్వప్రసాద్, ఐజీ తరుణ్ జోషి పాల్గొన్నారు.

ప్రజల సౌకర్యార్థం జిహెచ్‌ఎంసి పరిధిలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడానికి అలాగే మెరుగుపరచడానికి సమర్థవంతమైన చర్యలపై పోలీస్ అధికారుల సూచనలు డిజిపి కోరారు. విజిబుల్ పోలీసింగ్‌ను అమలు చేయడం అలాగే ట్రాఫిక్ సిబ్బందికి ఆధునిక శిక్షణ అందించడం వంటి అంశాలపై అధికారులు చర్చించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్త స్కైవాక్‌లు, ఫ్లైఓవర్‌ల చుట్టూ ట్రాఫిక్ పరిస్థితులను వివరిస్తూ ట్రాఫిక్ పోలీసు అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను డీజీపీకి వివరించారు.

మూసీ నది ప్రాంతంలో వంతెనల పరిస్థితి, ప్రతిపాదిత ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు, శిక్షణా కేంద్రం ఏర్పాటుపై అధికారుల దృష్టి సారించారు. నగరంలో జీహెచ్‌ఎంసీ ట్రాఫిక్‌ను మరింత మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను వ్యక్తం చేసిన డీజీపీ, ప్రజల సౌకర్యార్థం ప్రత్యేక చర్య లు చేపట్టాలని సూచించారు.