Telangana: హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు.. ఇన్స్‌పెక్టర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన డీజీపీ..

|

Aug 06, 2024 | 7:35 PM

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడడానికి కృషి చేసిన ఇన్స్పెక్టర్లకు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రశంస పత్రాలు అందజేశారు. హైదరాబాదులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో.. డీజీపీ జితేందర్ పలువురు ఇన్స్‌పెక్టర్లను అభినందించారు.

Telangana: హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు.. ఇన్స్‌పెక్టర్లకు ప్రశంస పత్రాలు అందజేసిన డీజీపీ..
Telangana DGP Jitender
Follow us on

హత్య కేసులో నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడడానికి కృషి చేసిన ఇన్స్పెక్టర్లకు తెలంగాణ డీజీపీ జితేందర్ ప్రశంస పత్రాలు అందజేశారు. హైదరాబాదులో మంగళవారం జరిగిన కార్యక్రమంలో.. డీజీపీ జితేందర్ పలువురు ఇన్స్‌పెక్టర్లను అభినందించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్నటువంటి మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల అశోక్ ను డీజీపీ అభినందించి ప్రశంసా పత్రం అందించారు. అశోక్ గతంలో పని చేసినటువంటి పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన హత్య కేసులలో కేసు నమోదు చేసి విచారణ జరిపి నిందితులను జ్యుడీషియల్ రిమాండ్‌కి పంపించారు.. అంతేకాకుండా త్వరితగతికన కేసును పూర్తి సాక్షాధారాలతో కోర్టుకు ఛార్జ్ షీటు దాఖలు చేసి నిందితులకు జీవిత ఖైదు శిక్ష పడడానికి కృషి చేశారు. దీనికి గాను మంచిర్యాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆకుల అశోక్.. తెలంగాణ రాష్ట్ర డిజిపి జితేందర్ నుంచి ప్రశంసా పత్రాలు అందుకున్నారు.

నేర సమీక్షా సమావేశం..

ఇదిలాఉంటే.. రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీసు ఉన్నతాధికారులు, జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో కలిసి డిజిపి డా.జితేందర్ (ఐపీఎస్).. అర్ధ వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో గత ఆరునెలల్లో నమోదైన కేసుల వివరాలు, దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. గత ఆరు నెలల క్రైమ్ స్టాటిస్టిక్స్, ట్రెండ్స్‌పై వివరణాత్మక సమీక్ష నిర్వహించి పలు సలహాలు సూచనలు చేశారు. ప్రజా భద్రత, ప్రస్తుత పోలీసింగ్ వ్యూహాల ప్రభావాన్ని అంచనా వేయడం.. అభివృద్ధి చెందుతున్న సవాళ్లను పరిష్కరించడానికి చర్యల గురించి చర్చించి.. డీజీపీ పోలీసు అధికారులకు పలు ఆదేశాలిచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..