Hyderabad: బైక్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా?.. మీకే ఈ బంపర్ ఆఫర్.. 294 వాహనాలకు త్వరలో వేలం.. ఎక్కడంటే?

మీరు బైక్ లేదా స్కూటర్ కొనే ప్లానింగ్‌లో ఉన్నారా.. అయితే ఆగండి కొత్త బండికి లక్షల రూపాయలు పెట్టకుండా సెకండ్ హ్యాండ్‌లో కూడా బండిని కొనొచ్చు అది కూడా సరమైన ధరకే.. ఎలా అనుకుంటున్నారా? హైదరాబాద్‌లోని సైబరాబాద్ పీఎస్‌ పరిధిలో పట్టుబడిన, వదిలేసిన వాహనాలను పోలీసులు వేలం వేయనున్నారు. ఈ వేలంలో పాల్గొని మీరు మీకు నచ్చిన వాహనాన్ని సొంత చేసుకోవచ్చు. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

Hyderabad: బైక్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా?.. మీకే ఈ బంపర్ ఆఫర్.. 294 వాహనాలకు త్వరలో వేలం.. ఎక్కడంటే?

Edited By: Anand T

Updated on: Dec 11, 2025 | 10:00 PM

సైబరాబాద్‌ పోలీస్ కమిషనరేట్‌ పరిధిలోని మొయినాబాద్ పోలీస్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ఉన్న వివిధ కేసుల్లో పట్టుబడిన, వదిలివేసిన, క్లెయిమ్ చేయని 294 వాహనాలను ఆన్‌లైన్‌ వేలం ద్వారా విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని సైబరాబాద్ పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. సైబరాబాద్ (మెట్రోపాలిటన్‌ ఏరియా) పోలీస్‌ చట్టం–2004 సెక్షన్‌ 6(2), 7తో పాటు, హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ చట్టం సెక్షన్‌ 39, 40, 41 ప్రకారం వాహనాలను వేలం వేయడానికి పోలీసులకు అధికారిక అనుమతి ఉందని ప్రకటనలో తెలిపారు.

ఈ వాహనాలపై ఎవరికైనా ఎటువంటి యాజమాన్య హక్కులు లేదా ఇతర అభ్యంతరాలు ఉన్నా ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి ఆరు నెలల్లో మీ వివరాలతో సైబరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గడువులోగా స్పందించని వాహనదారుల వాహనాలను పబ్లిక్‌ లో వేలం వేస్తామని స్పష్టం చేశారు.

మొయినాబాద్ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న వాహనాల వివరాలకు కోసం మోటార్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీస్ ఆర్ఐ ఎన్‌. వీరలింగంను సంప్రదించగలరు. మరిన్ని వివరాలకు 94906 17317ను సంప్రదించవచ్చని తెలిపారు. పూర్తి వివరాలు సైబరాబాద్‌ పోలీస్‌ అధికారిక వెబ్‌సైట్‌ www.cyberabadpolice.gov.in లో అందుబాటులో ఉన్నాయని ప్రకటనలో తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.