Hyderabad: హైదరాబాద్ సీపీ పేరిట.. ఏకంగా రూ. 43 లక్షలు ఊడ్చేసిన సైబర్ కేటుగాళ్లు

| Edited By: Ravi Kiran

Aug 10, 2024 | 11:36 AM

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతూపోతున్నాయి. వివిధ రకాల మోసాలతో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఓటీపీ, డ్రగ్స్ పార్సల్, పార్ట్ టైం జాబ్‌లంటూ.. ఇలా రోజుకో పంధాతో నిత్యం సైబర్ నేరగాళ్లు అమాయకులకు టోకరా వేస్తున్నారు.

Hyderabad: హైదరాబాద్ సీపీ పేరిట.. ఏకంగా రూ. 43 లక్షలు ఊడ్చేసిన సైబర్ కేటుగాళ్లు
Cyber Crime
Follow us on

రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతూపోతున్నాయి. వివిధ రకాల మోసాలతో సైబర్ నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఓటీపీ, డ్రగ్స్ పార్సల్, పార్ట్ టైం జాబ్‌లంటూ.. ఇలా రోజుకో పంధాతో నిత్యం సైబర్ నేరగాళ్లు అమాయకులకు టోకరా వేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట సిటీకి చెందిన రిటైర్డ్ మహిళా ఉద్యోగిని మోసం చేశారు. కొద్దిరోజుల క్రిందట ఆమె మొబైల్ నెంబర్‌పై హైదరాబాద్ నుంచి డ్రగ్స్ ఢిల్లీకి పార్సల్ అవుతున్నాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ పేరిట నేరగాళ్లు ఫోన్ చేసి బెదిరించారు. అకౌంట్‌లో మనీ ట్రాన్స్ఫర్ చేయాలని.. ఆర్బీ రూల్స్ మేరకు వెరిఫై చేసి తిరిగి పంపిస్తామంటూ మోసగించారు. దీంతో బాధితురాలు అకౌంట్‌లోని రూ. 22 లక్షలు కొల్లగొట్టారు. అనంతరం ఆమె తన కొడుకు ఈ విషయం చెప్పగా.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మరోవైపు ఆర్బిఐ అధికారి పేరుతో సిటీకి చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగిని బురిడీ కొట్టించారు సైబర్ చీటర్స్. ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్లతో క్రెడిట్ కార్డ్స్, బ్యాంక్ అకౌంట్స్‌ను ఓపెన్ చేసి.. ఆర్ధిక లావాదేవీలను ఇల్లీగల్ మనీ లాటరీలకు వాడుతున్నట్టు రిటైర్డ్ ఉద్యోగిని బెదిరించారు. అనంతరం ముంబై ఎన్ఐఏ అధికారి అంటూ ఓ వ్యక్తి బాధితుడికి వాట్సాప్ కాల్ చేసి భయభ్రాంతులకు గురి చేశారు. ఆ తర్వాత నకిలీ పిటిషన్‌లతో పాటు అరెస్టు వారంట్‌లను కూడా పంపించారు. కేసు ఫైల్ చేయొద్దంటే డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాల్సిందిగా నమ్మబలికించారు. దీంతో సదరు రిటైర్డ్ ఉద్యోగి రూ. 21 లక్షలు అకౌంట్‌లోకి ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు చెప్పగా.. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. ఇలా హైదరాబాద్‌లో ఇద్దరు రిటైర్డ్ ఉద్యోగుల నుంచి సుమారు రూ. 43 లక్షలను కాజేశారు సైబర్ నేరస్తులు.

 

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..