Hyderabad: హైదరాబాద్‌లో మరో కిడ్నాప్.. కరెంట్ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి..

Hyderabad: హైదరాబాద్‌లో మరో కిడ్నాప్.. కరెంట్ లేని సమయంలో ఇంట్లోకి చొరబడి..

Peddaprolu Jyothi

| Edited By: Ravi Kiran

Updated on: Aug 10, 2024 | 11:35 AM

నగరంలో వరుస కిడ్నాప్‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్‌లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే.. తాజాగా మరొక కిడ్నాప్ తీవ్ర కలకలం సృష్టిస్తుంది.

నగరంలో వరుస కిడ్నాప్‌లు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అబిడ్స్‌లో ఆడుకుంటున్న ఓ ఆరు సంవత్సరాల పాపను కిడ్నాప్ చేసిన ఉదాంతాన్ని మర్చిపోకముందే.. తాజాగా మరొక కిడ్నాప్ తీవ్ర కలకలం సృష్టిస్తుంది. హైదరాబాద్‌ హబీబ్‌నగర్‌ అఘాపురాలో ఓ బాలికను కిడ్నాప్‌ చేశాడో అగంతకుడు. రాత్రి కరెంటులేని సమయంలో ఇంట్లోకి చొరబడి బాలికను బలవంతంగా కారులో ఎత్తుకెళ్లాడు. కిడ్నాపర్‌ బారినుంచి చాకచక్యంగా తప్పించుకున్న బాలిక.. వెంటనే నాంపల్లి రైల్వే స్టేషన్ పరిధిలో కనిపించిన పెట్రోలింగ్ పోలీసులకు విషయాన్ని చెప్పింది. దీంతో నాంపల్లి పోలీసులు బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలికను తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Published on: Aug 10, 2024 08:55 AM