బయట రెస్టారెంట్స్‌లో ఎంత క్వాలీటీ ఫుడ్ వడ్డిస్తారో అందరికీ తెలిసిన విషయమే. అయినా కానీ బయట ఫుడ్ తినడం మాత్రం మానరు. ఆ ఫుడ్‌లో వాడే కలర్స్, మసాలాలు దారుణాతి దారుణం. ఇక చికెన్, మటన్ లాంటివి ఫ్రిజ్‌లో రోజుల తరబడి ఉంచి.. అవే వేడిగా వండి మీకు సర్వ్ చేస్తుంటారు. ఇక శుభ్రత అంటారా అది దేవుడికే తెలియాలి. ఒక్కసారి ఆ వండే కిచెన్ దగ్గరికి వెళ్తే.. మీకే సీన్ అర్థమవుతుంది. తాజాగా ఇంకో ఆందోళనకర విషయం బయటకు వచ్చింది. రెస్టారెంట్స్‌లో ఏవైనా ఫుడ్ ఆర్డర్ పెట్టినప్పుడు.. చట్నీలు, సాస్, రైతా వంటివి కప్స్‌లో ఇస్తారు. కొందరు కస్టమర్స్ టేస్ట్ నచ్చకపోతే ఎక్కువ తినరు. అలా మిగిల్చిన వాటిని తీసుకెళ్లి డస్ట్‌బిన్‌లో వేయాలి. కానీ.. హైదరాబాద్‌లోని ఓ హోటల్ జరిగిన తంతు తెలిస్తే.. ఇకపై జన్మలో రెస్టారెంట్‌కి వెళ్లరు.
బేగంపేటలోని ఓ ప్రముఖ హోటల్‌లో జరిగినట్లుగా ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో సర్కులేట్ అవుతుంది. ఆ వీడియోలో హోటల్ స్టాఫ్.. ఒక కస్టమర్ తినగా మిగిలిపోయిన చట్నీ, టమోట సాస్‌లను కిచెన్‌లోకి తెచ్చి… వాటన్నంటిని మరో బౌల్‌లోకి వేశాడు. వాటిని తీసుకెళ్లి జాగ్రత్తగా ఫ్రిజ్‌లో పెట్టాడు. దీంతో… మిగిలిపోయిన చట్నీలు, సాస్‌లను మరికొందరు కస్టమర్స్‌కు ఉపయోగిస్తారనే ఆరోపణలు వస్తున్నాయి. పక్కనే ఉన్న ఓ వ్యక్తి అందుకు సంబంధించిన వీడియో తీయగా.. ప్రస్తుతం అది వైరల్ అవుతోంది.
కస్టమర్లు మిగిల్చిన గ్రీన్ చట్నీ, టొమాటో సాస్ మళ్ళీ ఒక బౌల్ లో వేసి మరుసటి రోజు వాడడం ఈ Mezbaan రెస్టారెంట్ ప్రత్యేకత.
Green Chutney and Ketchup leftover by customers are stored and served next da. This is the speciality of Mezbaan at Begumpet, Hyderabad pic.twitter.com/N0PxYf0Qg4
— musicofarun (@musicofarun) April 16, 2024
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో రెస్పాండ్ అవుతున్నారు. సదరు రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. హెటల్స్, రెస్టారెంట్స్‌కి వెళ్లి.. శభ్రత కోరుకోవడం తప్పని మరొకరు పేర్కొన్నారు. ఇది నిత్యకృత్యమే మన హెల్త్ బాగుండాలంటే.. ఇంట్లో కుక్ చేసుకుని తినడం బెటర్ అని మరొకరు పేర్కొన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాలని మరో నెటిజన్ GHMCని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..