Hyderabad Rains: హైదరాబాద్‌ వర్షానికి సంబంధించిన ఆ వీడియోలను షేర్‌ చేస్తే కఠిన చర్యలు.. హెచ్చరించిన సీపీ.

Rain in Hyderabad: ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్ర రాజధాని హదరాబాద్‌లోనూ గత కొన్ని రోజులుగా...

Hyderabad Rains: హైదరాబాద్‌ వర్షానికి సంబంధించిన ఆ వీడియోలను షేర్‌ చేస్తే కఠిన చర్యలు.. హెచ్చరించిన సీపీ.
Cp Bagawath Hyderabad Flood

Updated on: Jul 16, 2021 | 12:51 PM

Hyderabad Rains: ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో రాష్ట్ర రాజధాని హదరాబాద్‌లోనూ గత కొన్ని రోజులుగా విస్తారంటా వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఈ సమయంలోనే కొంత మంది గతేడాది హైదారాబాద్ వరదలకు సంబంధించిన వీడియోలను కొత్తవిగా షేర్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై రాచకొండ సీపీ మహేస్‌ భగవత్‌ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు. భారీ వర్షాలకు నగరంలో వరదులు వచ్చాయి, ఇళ్లు కూలిపోతున్నాయి అని పాత వీడియోలను వైరల్ చేస్తోన్న వారిపై కఠినంగా వ్యవహరిస్తామని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘కొందరు ఉద్దేశపూర్వకంగా గతేడాది వరదల వీడియోలను కొత్తవిగా ప్రచారం చేస్తూ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటాం. వర్షాల కారణంగా ఎవరికైనా ఇబ్బందులు ఎదురైతే 100కు ఫోన్‌ చేస్తే సంబంధిత సిబ్బంది సహకారం అందిస్తారు. పోలీసులు, జీహెచ్‌ఎంసీ అధికారులకు, రెవెన్యూ, ఇరిగేషన్‌ సిబ్బందికి ప్రజలు సహకరించాలి’ అని సీపీ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే నగరంలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.

Also Read: Newton Predicts: న్యూటన్ ముందే చెప్పాడా.. భూమి అంతం కాబోతోందా.. ప్రళయం ముంచుకొస్తోందా..

Hyderabad: బర్త్ డే దావత్ బ్రతుకులను ఛిద్రం చేసింది.. ఇద్దరు మృతి

Hidden treasures : శంషాబాద్ మండలంలో గుప్తనిధులు.! పూరాతన గుమటంలో తవ్వకాల కలకలం