CP Anjani Kumar: నగర శాంతి భద్రతలపై సీపీ అంజనీకుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌.. లా అండ్‌ ఆర్డర్‌పై సమీక్ష

CP Anjani Kumar: హైదరాబాద్‌ నగరంలో శాంతి భద్రతల పరిస్థితులపై నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లా అండ్‌ ఆర్డర్..

CP Anjani Kumar: నగర శాంతి భద్రతలపై సీపీ అంజనీకుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌.. లా అండ్‌ ఆర్డర్‌పై సమీక్ష

Updated on: Jan 15, 2021 | 9:32 PM

CP Anjani Kumar: హైదరాబాద్‌ నగరంలో శాంతి భద్రతల పరిస్థితులపై నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. లా అండ్‌ ఆర్డర్‌పై అన్ని జోనల్‌ అధికారులతో సీపీ సమీక్ష జరిపారు. ఐదు జోన్ల డీసీపీలు, కమిషనరేట్‌ పరిధిలోని సీనియర్‌ అధికారులు పాల్గొన్న ఈ వీడియో కాన్ఫరన్స్‌లో అంజనీకుమార్‌ మాట్లాడుతూ.. నేను సైతం సీసీటీవీ ప్రాజెక్టు కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సర్వైలెన్స్‌ కెమెరాల పనితీరు పర్యవేక్షించాలని సూచించారు.

అదే విధంగా నగర వ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీ టీవీ కెమెరాలను పరిశీలించాలని అన్నారు. అయితే ఈ సీసీ కెమెరాల వల్ల ఎన్నో కేసులు పరిష్కారం అయ్యాయని, కమిషనరేట్‌ పరిధిలోని అన్ని పోలీసు స్టేషన్‌ పరిసరాల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని సీసీ టీవీ కెమెరాలను పరిశీలించి అన్ని పని చేస్తున్నాయా..? లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. సీసీ కెెెమెరాల్లో ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే సరి  చేయాలన్నారు. అన్ని పోలీసుస్టేషన్‌ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలన్నారు.

Khairatabad Railway Gate: ఈ నెల 18 నుంచి ఖైరతాబాద్‌ రైల్వేగేట్‌ మూసివేత.. ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు