Hyderabad: హాట్ టాపిక్‌గా కార్పొరేటర్ విజయారెడ్డి ఎపిసోడ్.. హస్తం దరి చేరేందుకు సిద్ధం?

|

Jun 19, 2022 | 1:30 PM

హైదరాబాద్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా కార్పొరేటర్ విజయారెడ్డి ఎపిసోడ్ నిలిచింది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీలో కార్పొరేటర్‌గా గెలిచిన ఆమె.. హస్తం గూటికి చేరేందుకు సిద్ధమవడమే టాక్ ఆప్ ది పాలిటిక్స్‌గా మారింది.

Hyderabad: హాట్ టాపిక్‌గా కార్పొరేటర్ విజయారెడ్డి ఎపిసోడ్.. హస్తం దరి చేరేందుకు సిద్ధం?
Vijaya Reddy, Revanth Reddy (File Photo)
Follow us on

పీజేఆర్ కుమార్తె, ఖైరతాబాద్ కార్పొరేటర్‌ విజయా రెడ్డి.. టీఆర్‌ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారామె. ఈ నెల 23న కాంగ్రెస్‌ కండువా కప్పుకోబోతున్నట్టు విజయారెడ్డి ప్రకటించారు. పీజేఆర్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే ఉద్ధేశంతోనే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ అని ఆమె గుర్తు చేశారు. సోనియాగాంధీ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ కార్పొరేటర్‌గా అవకాశం వచ్చినంత వరకు ప్రజాసేవ కోసం పనిచేశా. పీజేఆర్ బిడ్డగా నన్ను ఇప్పటికీ ఎక్కువ మంది కాంగ్రెస్ నేతగానే చూస్తున్నారు. కాంగ్రెస్‌లో చేరాలని కొంత కాలంగా భావిస్తున్నా.. కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు అందరితో చర్చించాకే ఈ నిర్ణయం తీసుకున్నా అంటూ విజయారెడ్డి స్పష్టం చేశారు. పదవుల కోసం కాంగ్రెస్‌లో చేరడంలేదు. పీజేఆర్ బిడ్డగా మీ ప్రేమ, మద్దతు ఎప్పటిలాగే ఉంటుందన్న నమ్మకంతోనే కాంగ్రెస్‌తోకి చేరుతున్నట్టు తెలిపారామె.

గ్రేటర్ ఎన్నికల సమయంలో విజయా రెడ్డి డిప్యూటీ మేయర్ పదవి ఆశించారు. కానీ, దక్కలేదు. ఆ ఎన్నిక సమయంలోనే ఎన్నికల హాల్ నుంచి విజయా రెడ్డి సడన్ గా వెళ్లిపోయారు. ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో పీజేఆర్ వారసులుగా తనకు ప్రాధాన్యత దక్కాలని విజయా రెడ్డి కోరుకున్నారు. అయితే, అక్కడ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ ఉన్నారు. అదే సమయంలో తనకు పార్టీలో తగిన గుర్తింపు లేదనే అసంతృప్తితో విజయా ఉన్నారామె. ఇప్పుడు రేవంత్‌ను కలిసిన తర్వాత పార్టీ మార్పుపై స్పష్టత ఇచ్చారు. తమ కుటుంబం ముందు నుంచి కాంగ్రెస్‌లోనే ఉందని విజయారెడ్డి గుర్తు చేశారు. ఆ పార్టీలో సాగితేనే బాగుంటుందని భావిస్తున్నానని విజయారెడ్డి అన్నారు.