Hyderabad: రేవంత్ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఫ్లైఓవర్ పేరు.. తెలంగాణ తల్లి

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రధాన ఫ్లైఓవర్లలో ఒకటైన తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మార్చుతున్నట్టు పేర్కొంది. ఇకపై ఈ ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈ మేరకు కొత్త పేరుతో కూడిన బోర్డును సైతం ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసింది.

Hyderabad: రేవంత్ సర్కార్‌ కీలక నిర్ణయం.. ఇకపై ఆ ఫ్లైఓవర్ పేరు.. తెలంగాణ తల్లి
Telangana Talli Flyover

Updated on: Sep 30, 2025 | 3:21 PM

నగరంలోని ప్లైఓవర్‌ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని ప్రధాన ఫ్లైఓవర్లలో ఒకటైన తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును మార్చుతున్నట్టు పేర్కొంది. ఇకపై ఈ ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. నగరం నడిఒడ్డున సచివాలయం సమీపంలో ఉన్న ఈ ఫ్లైఓవర్‌ ఇప్పటి వరకు తెలుగు తల్లి ప్లైఓవర్ అనే పేరుతో కొనసాగింది. రాష్ట్ర ప్రభుత్వం తాజాజా తీసుకున్న నిర్ణయంతో ఇకపై ఈ ప్లైఓవర్ ‘తెలంగాణ తల్లి’ ఫ్లైఓవర్‌గా గుర్తింపు పొందనుంది.

అయితే ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే అమల్లోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే సెక్రెటేరియల్ సమీపంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద ప్రభుత్వం కొత్త మార్చిన తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ పేరుతో నేమ్‌ బోర్డును కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఫ్లైఓవర్ పేరు అధికారంగా అమల్లోకి వచ్చినట్టు అర్థమవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.