ఈ సారి కేంద్రంలో ఏ రాజకీయ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాదని.. సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కేంద్ర పన్నుల్లో వాటా, వికేంద్రీకరణ, ఫెడరల్ ఫ్రంట్ వంటి ప్రధానాంశాలు ప్రజల్లో మార్పును తెస్తుందని పేర్కొన్నారు. తెలంగాణాలో 16 ఎంపీ స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులే విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో ఎవరు సీఎం కావాలనేది అక్కడి ప్రజలు నిర్ణయిస్తారని, ఎవరైనా ప్రజలకు మంచి చేయడమే కావాలని అన్నారు. ట్విట్టర్ వేదికగా ప్రజలతో మాట్లాడారు కేటీఆర్. ఈ సందర్భంగా ప్రజలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.