Droupadi Murmu: తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన కొనసాగుతోంది. ఈనెల 21వరకూ హైదరాబాద్‌లోని పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొంటారు ముర్ము. శీతాకాల విడిదిలో భాగంగా ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం నిర్వహిస్తారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Droupadi Murmu: తెలంగాణలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
CM Revanth Reddy receives President Droupadi Murmu

Updated on: Dec 17, 2024 | 8:41 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో పర్యటిస్తున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు. హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క, సీఎస్ శాంతికుమారి ఘన స్వాగతం పలికారు. ఈ నెల 21 వరకు హైదరాబాద్‌లోనే ఉంటారు రాష్ట్రపతి. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు.

ఈ నెల 20న రాష్ట్రపతి నిలయంలో ఎట్‌ హోమ్‌ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పౌరులు హాజరవుతారు.

ఈ నెల20న సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌ కాలేజీని రాష్ట్రపతి సందర్శించనున్నారు. డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కళాశాలకు రాష్ట్రపతి స్కాలర్స్‌ అవార్డును రాష్ట్రపతి ప్రధానం చేయనున్నారు.

21న ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని రాష్ట్రపతి సందర్శిస్తారు. కోటి మహిళా కాలేజీ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది పాల్గొంటారు.

ఆ తర్వాత మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి రాకతో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేస్తున్నారు.

ఏపీలో పర్యటించిన రాష్ట్రపతి ముర్ము..

కాగా.. మంగళవారం ఏపీలో పర్యటించారు రాష్ట్రపతి ముర్ము. ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న రాష్ట్రపతి.. అనంతరం ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవంలో పాల్గొన్నారు. ఈకార్యక్రమంలో ఏపీ గవర్నర్, సీఎం చంద్రబాబు, మంత్రులు,పలువురు అధికారులు పాల్గోన్నారు. 49 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు రాష్ట్రపతి. యువ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు ముర్ము. జాతి సమ్మిళిత ఆరోగ్య సంరక్షణలో యువ వైద్యులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రపతికి విమానాశ్రయంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఉన్నతాధికారులు వీడ్కోలు పలికారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..