CM KCR : సీఎం కేసీఆర్ చర్య ద్వారా దళిత సమాజంలో ఒక భరోసా ఉప్పెనలా పొంగింది : దళిత మేథావులు.. నేతలు

|

Jun 28, 2021 | 11:33 PM

తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, వారి జీవితాల్లో గుణాత్మక మార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని,..

CM KCR :  సీఎం కేసీఆర్ చర్య ద్వారా దళిత సమాజంలో ఒక భరోసా ఉప్పెనలా పొంగింది : దళిత మేథావులు..  నేతలు
Cm Kcr
Follow us on

Dalit intellectuals : తెలంగాణ దళిత సమాజాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచి, వారి జీవితాల్లో గుణాత్మక మార్పును రాబట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని, తమ లక్ష్యసాధనలో దళిత మేధావి వర్గం కదలి రావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో సీఎం తక్షణమే స్పందించి వారి కుటుంబాన్ని నిలబెట్టడం, ఆమె చావుకు కారణమైన పోలీసులను ఉద్యోగంలోంచి సస్పెండ్ చేయడం, నేరం నిరూపణయితే ఉద్యోగంలోంచి శాశ్వతంగా తొలగిస్తామనడం గొప్ప విషయమన్నారు.

సీఎం చర్య ద్వారా దళిత సమాజంలో ఒక భరోసా ఉప్పెనలా పొంగిందని ఈ సందర్భంగా దళిత నేతలు చెప్పుకొచ్చారు. ఎస్సీ, ఎస్టీ జాతీయ మేధావుల ఫోరం, మాదిగ మేధావుల ఫోరం, మాదిగ విద్యావంతుల వేదిక, ఉస్మానియా యూనివర్సిటీ నాన్ టీచింగ్ స్టాఫ్ వెల్ఫేర్ అసోసియేషన్ తదితర దళిత సంఘాలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు, మేధావులు ఇవాళ సీఎం కేసీఆర్ ను కలిశారు. దళితుల అభ్యున్నతే పరమావధిగా సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ సదస్సు నిర్వహించిన క్రమంలో, దళిత మేధావులు నేడు సీఎం కేసీఆర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు.

Read also : Sajjala : ఉద్యోగాల కల్పనపై చంద్రబాబును ఎప్పుడైనా నిలదీశారా? : ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి